జొమాటో డెలివరీ బాయ్ ను చెప్పుతో చితక్కొట్టిన యువతి, ఎందుకంటే?

అప్పట్లో ఒక యువతి ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేసి, డెలివరీ బాయే తనను కొట్టాడని కల్లబొల్లి మాటలు చెప్పింది.కొన్ని రోజులకు ఆమె చెప్పిందే తప్పు అని, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే ఆమె అలా చేసిందని తేలింది.

 Woman Hit Zomato Boy By Her Slipper In Karnataka Video Goes Viral , Karnataka,-TeluguStop.com

అయితే అందుకు సంబంధించి వీడియో ఏదీ రికార్డు కాకపోవడంతో అసలు నిజం తెలిసేందుకు కొన్ని రోజుల సమయం పట్టింది.అయితే అచ్చంగా అలాంటి ఘటన ఇప్పుడు కర్ణాటకలో జరిగింది.

ఓ యువతి జొమాటో డెలివరీ బాయ్ ను పట్టుకుని బూతులు తిట్టింది.అక్కడితో ఆగకుండా తన కాలికి ఉన్న బూటు తీసి అతడిని తీవ్రంగా కొట్టింద.

ఆ యువతి ఇష్టారీతిగా బూతులు తిడుతూ కొట్టినా, ఆ డెలివరీ బాయ్ ఏమీ అనకుండా అలాగే ఉండిపోయాడు.వేరే వారి కోసం వచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా ఆ ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ పార్ట్ నర్ పైనే దాడి చేసింది ఆ యువతి.

ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలను పక్కనే ఉన్న వాళ్లు రికార్డు చేశారు.ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు ఓ వ్యక్తి.తన ఆర్డర్ తీసుకువస్తుండగా.

ఓ యువతి ఆర్డర్ తీసుకోవడమే కాకుండా జొమాటో బాయ్ ను కొట్టిందని పోస్టు చేశాడు.అసలు ఫుడ్ తీసుకున్న ఆ యువతికి, ఆర్డర్ చేసిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.

ఈ ఘటనపై జొమాటోకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోవడంలేదని చెప్పాడు.ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో జొమాటో స్పందించక తప్పలేదు.

విషయాన్ని పరిశీలిస్తామని మాత్రం చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube