అల్లుడి హత్యకు అదిరిపోయే స్కెచ్ వేసిన అత్త.. చివరికి?

కూతురి జీవితం బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు.అలాంటిది కూతురు భర్తను చంపడానికి ప్లాన్ చేసింది ఓ అత్త.

 Mother In Law Planned For Son In Law Murder, Son In Law, Murder, Property Disput-TeluguStop.com

అల్లుడిని చంపడానికి ముగ్గురితో 10 లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకుని, ఎంతో చాకచక్యంగా అల్లుడిని చంపించింది.చివరకు పోలీసులకు విషయం తెలియడంతో ఆ అత్త ఊచలు లెక్కపెడుతుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కి చెందిన కపిల్ పవార్ అనే న్యాయవాది, తన భార్య మమతా పవార్ గత సంవత్సరం క్రితం మరణించింది.దీంతో ఆ అత్త, అల్లుడికి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి.

ఎలాగైనా తన అల్లుడిని అంతమొందించి ఆస్తిని కాపాడుకోవాలని అత్త షిమ్లా పవార్(66) రాహుల్, అన్వర్, హర్ష యాదవ్ అనే ముగ్గురు వ్యక్తులతో కలిసి తన అల్లుడిని చంపడానికి డీల్ కుదుర్చుకుంది.
పథకం ప్రకారం ఆ ముగ్గురు వ్యక్తులు కపిల్ పవార్ కు కోడిగుడ్లలో మత్తు మందు కలిపి ఇచ్చారు.

దీంతో అతను స్పృహ తప్పి పడిపోవడం వల్ల బెల్టుతో అతని మెడకు బిగించి,చంపారు.చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకు వెళ్లి ఏతవా జిల్లాలోని డ్రైనేజీ లో పడేశారు.

కపిల్ కనిపించలేదని మిస్సింగ్ కేస్ కింద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డ్రైనేజీలు కపిల్ శవాన్ని గుర్తించారు.
కపిల్ కనిపించకపోవడానికి ముందు రోజు ఈ ముగ్గురు వ్యక్తులతో కలిసి మాట్లాడినట్లు పోలీసులకు తెలియడంతో పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయట పెట్టారు.

తన అత్త 10 లక్షలకు డీల్ కుదిర్చే తన అల్లుడిని చంపించిన ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.దీంతో తన అత్త, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరొక వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube