50 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం దొరికింది.. దాని ప్రత్యేకత ఏంటో తెలిస్తే అవాక్కవుతారు  

Woman Got Wedding Ring Nearly 50 Years After She Lost-telugu Viral News Updates,viral In Social Media,wedding Ring,wedding Ring Found After 50 Years

ఏదైనా వస్తువు పోయింది అంటే అది దొరికితే ఒకటి రెండు రోజుల్లో మా అంటే నెల రోజుల్లో దొరకాలి. అలా కాదని నెల తర్వాత కూడా ఆ వస్తువు దొరకలేదు అంటే ఇక దానిపై ఆశ వదులుకోవాల్సిందే. ఎంతో మనసు పడ్డ వస్తువులు అయినా, ప్రాణంకు ప్రాణం అయిన వస్తువులు అయినా సరే పోయిన తర్వాత మళ్లీ దొరకడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది..

50 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం దొరికింది.. దాని ప్రత్యేకత ఏంటో తెలిస్తే అవాక్కవుతారు-Woman Got Wedding Ring Nearly 50 Years After She Lost

ఇక పోయిన వస్తువులు చాలా ఆలస్యంగా దొరకడం అనేది మరింత రేర్‌ విషయం. అయితే అమెరికాలో ఒక బామ్మ 50 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న వెడ్డింగ్‌ ఉంగరంను పొందింది. ఆ సమయంలో ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే. అమెరికాలోని టెన్నెస్సీ ప్రాంతంకు చెందిన ప్లోరెన్స్‌ అనే మహిళ 1970వ సంవత్సరంలో అదే ప్రాంతంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇద్దరు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఒక రోజు గార్డెన్‌లో ప్లొరెన్స్‌ మొక్కలు నాటేందుకు మట్టి తవ్వుతోంది. ఆ సమయంలోనే ఆమె చేతికి ఉన్న వెడ్డింగ్‌ రింగ్‌ పోయింది. ఇండియన్స్‌ మంగళసూత్రం ఎంత ప్రముఖంగా భావిస్తారో వారు వెడ్డింగ్‌ రింగ్‌ను అంత ప్రముఖంగా భావిస్తారు.

అలాంటి వెడ్డింగ్‌ రింగ్‌ పోవడంతో ఆమె వారం పది రోజుల వరకు తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టేసింది..

ఎంత వెదికినా దొరకక పోవడంతో కొన్ని రోజులు వెదికి ఆ తర్వాత వదిలేసింది. కాల క్రమంలో ప్లొరెన్స్‌ భర్త చనిపోయాడు.

ఆమె పిల్లలు పెద్ద వారు అయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 90 ఏళ్లు. ఈ సమయంలో ఆమె వెడ్డింగ్‌ రింగ్‌ పోగొట్టుకుందనే విషయాన్ని వెస్లీ వైట్‌ తెలుసుకున్నాడు. ఈ వయసులో ఆమెకు సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఉంగరం వెదికి పెట్టాలనుకున్నాడు..

మెటల్‌ డిటక్టర్‌ సాయంతో దాదాపు గంటన్నర పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో అణువణువు శోదించాడు. చివరకు అతడు సాధించాడు. ప్లొరెన్స్‌ పోగొట్టుకున్న వెడ్డింగ్‌ రింగ్‌ను కనిపెట్టాడు.

ఆమెకు ఆ వెడ్డింగ్‌ రింగ్‌ను కానుకగా ఇచ్చాడు. ఆ సమయంలో ఆమె కళ్లలో ఆనందంకు కుటుంబ సభ్యులు అంతా సంతోషించారు. చనిపోయిన భర్తను తల్చుకుని చేతి వేలికి అప్పటి వెడ్డింగ్‌ రింగ్‌ను పెట్టుకుని ఆమె మురిసి పోయింది.