ఒకే కాన్పులో ఆరుగురుకి జన్మనిచ్చిన మహిళ  

Woman Gives Birth To Tuplets In Madhya Pradesh - Telugu Birth Babies, Madhya Pradesh, Mysteries, Woman Gives Birth To Tuplets

అప్పుడప్పుడు కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.అలాంటి సంఘటనలు జరిగినపుడు వైద్యులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు.

Woman Gives Birth To Sextuplets In Madhya Pradesh

మన పురాణాలలో కౌరవులు నూరు మందిని ఒకేసారి గాంధారి కన్నది అని చదువుకున్నాం అయితే అది జరిగిందో లేదో కూడా తెలియదు.అయితే అప్పుడప్పుడు ఆడవాళ్ళు కవల పిల్లలకి జన్మనిస్తూ ఉంటారు.

జంతువులు అయితే ఒకేసారి ఆరు, ఏడు, పది వరకు పిల్లలని కంటాయి.మనుషులలో ఆ సామర్ధ్యం ముగ్గురు పిల్లల వరకు ఉంటుంది, అరుదుగా నలుగురు పిల్లల్ని కంటూ ఉంటారు.

అయితే ఒక మహిళ ఆశ్చర్యకంరంగా ఆరుగురు పిల్లలకి జన్మనిచ్చింది.

మధ్యప్రదేశ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

శెయోపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన జరగగ జన్మించిన ఆరుగురు శిశువుల్లో ఇద్దరు శిశువులు వెంటనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.మిగతా నలుగురూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

వారిని సిక్ న్యూబార్న్స్ కేర్ యూనిట్ లో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.ఒకే కాన్పులో ఆరుగురు జన్మించారని చెప్పగానే 22 ఏళ్ల ఆ తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ ద్వారానే ఇది సాధ్యం కావడం విశేషం.ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకి జన్మనివ్వడం అనేది చాలా అరుదైన ఘటన అని ఆ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.

చాలా అరుదుగా ఎవరికో ఇలా జరుగుతుందని అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Gives Birth To Sextuplets In Madhya Pradesh Related Telugu News,Photos/Pics,Images..

footer-test