చేపను పట్టి లక్షలు సంపాదించిన వృద్ధురాలు  

Woman gets more money with a single huge fish, West Bangal, Fisher Women, Old Women, Costly Fish - Telugu Costly Fish, Fisher Women, Old Women, West Bangal, Woman Gets More Money With A Single Huge Fish

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.కొందరికి అదృష్టం లాటరీ రూపంలో వస్తే, కొంత మంది ఏదైనా వస్తువు రూపంలో వస్తుంది.

TeluguStop.com - Woman Gets More Money With A Single Huge Fish

కొంత మందికి చేప రూపంలో కూడా అదృష్టం వరిస్తుంది.అనుకోకుండా వారికి దొరికిన చేప మార్కెట్ లో లక్షల రూపాయిలకి అమ్ముడుపోయి వారి కష్టానికి ఫలితంగా వచ్చి పడతాయి.

ఇప్పుడు ఓ వృద్ధురాలికి అలాగే చేప రూపంలో ఏకంగా మూడు లక్షలు వచ్చి పడ్డాయి.పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్ కు చెందిన పుష్పాకర్ అనే వృద్ధ మహిళ సుందర్బన్స్ ప్రాంతంలో ఎప్పట్లాగే చేపల వేటకు వెళ్లింది.

TeluguStop.com - చేపను పట్టి లక్షలు సంపాదించిన వృద్ధురాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంతలో ఓ పెద్ద చేప నీటిలో కొట్టుకుని వస్తున్నట్టు గుర్తించి, అమాంతం నీళ్లలో దూకి దాన్ని అతి కష్టంమ్మీద ఒడ్డుకు చేర్చింది.
అక్కడ ఉన్న మత్స్యకారుల సాయంతో ఆ పెద్ద చేప మార్కెట్ కు తీసుకెళ్లగా, దాని బరువు 52 కేజీలు అని తేలింది.

ఆ చేపలోని కొన్ని భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.దాంతో ఆ చేప ధర కేజీ 6,200 వరకు పలికింది.దీంతో 52కేజీల ఆ చేప రూపంలో వృద్ధురాలికి 3 లక్షలకు పైగా సొమ్ము చేతికందింది.ఒక్క చేపతో లక్షలు వచ్చిపడడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇన్ని రోజులు చేపలు వేట సాగించిన తినడానికి కూడా కష్టంగా ఉండేదని ఇప్పుడు ఈ రూపంలో మహాలక్ష్మి తన ఇంటికి వచ్చిందని ఆ మహిళ సంతోషాన్ని పంచుకుంది.అయితే ఈ చేప పాక్షికంగా దెబ్బతిని ఉండటంతో ఆమెకి దొరికిందని, లేదంటే అంత ఈజీగా వలకి చిక్కదని అక్కడున్నవారు చెబుతున్నారు.

అలాగే గాయం లేని చేప ఖరీదు ఇంకా ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెప్పారు.

#West Bangal #Old Women #WomanGets #Costly Fish #Fisher Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Gets More Money With A Single Huge Fish Related Telugu News,Photos/Pics,Images..