ఈమెకు ఏమైనా పిచ్చా... ఫొటోలు ఎవరైనా ఇలా దిగుతారా?  

Woman Gets A Award For Different Type Of Photoshoot-stephanie Lee Roj,women,విచిత్రంగా ఫొటోలు

పుర్రెకో బుద్ది అంటారు. అంటే ఒక్కో పనిని ఒకొక్కరు ఒక్కో విధంగా చేస్తారు..

ఈమెకు ఏమైనా పిచ్చా... ఫొటోలు ఎవరైనా ఇలా దిగుతారా?-Woman Gets A Award For Different Type Of Photoshoot

రకరకాలుగా ప్రవర్తనలు కలిగి ఉన్న జనాలు మన చుట్టు ఉంటారు. అయితే కొందరిని చూస్తే మాత్రం వీరికి ఏమైనా పిచ్చా అనిపిస్తుంది. ముఖ్యంగా సెఫానీ లీ రోజ్‌ అనే అమ్మాయి ప్రవర్తన చూస్తే నిజంగా ఆమెకు పిచ్చి ఉందనిపించక మానదు.

కాని ఆమె ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా చాలా నార్మల్‌గా ఉంటుంది. ఆ ఒక్క విషయంకు వచ్చేప్పటికి మాత్రం ఆమె పిచ్చిదాని వలే ప్రవర్తిస్తుంది. ఆ ఒక్కటి ఏంటో అనుకుంటున్నారా.

ఫొటోలు తీసుకోవడం.

అవును… రోజ్‌ చాలా విచిత్రంగా ఫొటోలు తీసుకుంటుంది. ఆమె ఫొటోలు తీసుకునే విధానం వల్లే ప్రస్తుతం ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది.

ఫొటోలు చాలా విభిన్నంగా తీసుకుంటే దానికి ఫొటోగ్రాఫీ అవార్డు వస్తుంది. కాని రోజ్‌ తీసుకునే ఫొటోలకు అవార్డులు రావు కాని, అందరి నుండి ఆశ్చర్యం అయితే వస్తుంది. అందరు ఫొటో అనగానే ఎంత బాధలో ఉన్నా, మరే కష్టంలో ఉన్నా, పని చేస్తున్నా కూడా కాస్త జుట్టు అది సరి చేసుకుని, మొహంపై లేని నవ్వును పులుముకుని మరీ కెమెరా ముందు నిల్చుంటారు..

కాని రోజ్‌ మాత్రం అలా కాదు.

రోజ్‌ ఫొటో అంటే చాలు ఠక్కున నేలపై బొక్క బోర్లా పడుకుండి పోతుంది. ఆమె ప్రతి ఫొటోలో కూడా అంతే కనిపిస్తుంది. ప్రపంచ టూర్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం పలు ఫొటోలను తన సోషల్‌ మీడియా వాల్‌పై పోస్ట్‌ చేసింది.

అయితే అన్నింట్లో కూడా ఆమె బొక్క బోర్లా పడుకుని మాత్రమే కనిపించడం విశేషం. సెల్ఫీలు తీసుకోవడం, కెమెరాకు మొహం చూపిస్తూ ఫొటోలు దిగడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఆమెకు ఏమైనా పిచ్చా అనుకుంటారు..

మరి కొందరు ఆమె క్రియేటివిటీకి వావ్‌ అంటారు. మొత్తానికి రోజ్‌ విభిన్నమైన అమ్మాయిగా నిలిచింది.