18 వేల అడుగుల ఎత్తులో పురుడు పోసుకున్న మహిళ...! చివరకు...?!

కొందరి పుట్టుకలు చాలా వింతగా ఉంటాయి.ముఖ్యంగా నిండు గర్భిణీలు డెలివరీ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు సడన్ గా హాస్పిటల్ కు చేరకముందే దారి మధ్యలోనే పురుడు పోసుకోవడంతో, ఇలా చాలా మంది పిల్లలు జన్మించారు.

 Woman Gave Birth To A Baby Boy While Flying Over Alaska, Alaska,lady, Delivery,-TeluguStop.com

అయితే ఈ బుడ్డోడు మాత్రం కాస్త వెరైటీ.అందరూ భూమి మీద ఏదో ఒక ప్రదేశం లో జన్మించి ఉంటారు.

కానీ, ఈ బుడ్డోడు మాత్రం భూమి నుండి 18 వేల అడుగులు పైన గాలిలో తన తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చాడు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే…

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

ఓ నిండు గర్భిణిని విమానంలో ఆస్పత్రికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఆ మహిళకు 35 వారాలు గర్భిణీ కావడంతో తాను ఆసుపత్రిలో చేరేందుకు విమానంలో ప్రయాణించడానికి సిద్ధపడింది.

అయితే అనుకోకుండా విమానం గాలిలో ఉన్నప్పుడే ఆ మహిళ ఓ మగబిడ్డకు జన్మను ఇచ్చింది.అలా ఆ బుడ్డోడు తన తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన సమయంలో విమానం భూమి నుండి ఏకంగా 18 వేల అడుగుల పైన ప్రయాణం చేస్తోంది.

ఇకపోతే ఆ బిడ్డకు స్కై అనే పేరు పెట్టారు.

Telugu Aeroplane, Alaska, Born Baby, Delivery, Lady, Pregnant, Gavebaby-Telugu N

విమానం బయలుదేరే అంతవరకు బాగానే ఉన్నా ఆమె ఆరోగ్యం, విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తనకు పురిటినొప్పులు మొదలవగా… కాస్త కష్టంగానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఇక ఆ తరువాత విమానం ల్యాండ్ జరిగాక ఆమెను, పుట్టిన బిడ్డను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు విమాన సిబ్బంది.డాక్టర్లు ఇచ్చిన ప్రసవ తేదీ కంటే ముందుగానే జన్మించిన బాలుడిని ఇంకుబేటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారని, వారిని పది రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube