బాలికపై ఆరుగురు యువకుల రేప్..     2018-07-19   13:21:34  IST  Bhanu C

ఒక్క రోజులు అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి..కామాంధులకి ఖటిన శిక్షలు పడిన వార్తలు కూడా మనం నిత్యం వింటూనే ఉంటున్నాం అయితే ఎన్నో పరిణామాలు నిత్యం చూస్తూనే ఉన్నా సరే ఒక్కరికి కూడా చట్టాలపై కానీ కోర్టులు విధించే శిక్షలపై కానీ భయం ఉండటం లేదు అంతేకాదు..రోజు రోజు కి ఈ ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..నిన్న కాక మొన్న తమిళ నాడులో ఒక అపార్ట్ మెంట్ లో 11 ఏళ్ల పాపపై కొంతమంది మృగాలు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే

Woman Gang-raped-

Woman Gang-raped

మళ్ళీ అదే చెన్నై నగరం లో ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన ఒక యువకుడు ఆమెను తన స్నేహితులకు అప్పగించాడు. పుదుచ్చేరిలోని ఒక గ్రామానికి చెందిన నిరుపేద కార్మికుని కుమార్తె చెన్నై నగరంలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని తానే పోషిస్తోంది అయితే ఆమెకి విల్లుపురం జిల్లా వళుతావూరుకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యాడు..ఆమెని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ పరిచయం పెంచుకుని ట్రాప్ చేశాడు..

అభం శుభం తెలియని ఆబాలికకి మాయమాటలు చెప్పి..ఆమె ని లోబరుచుకున్నాడు ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో తీసి బెదిరిస్తూ అనేకసార్లు రేప్‌చేశాడు..తన ఆరుగురు స్నేహితులకు బాలికను అప్పగించగా వారూ ఆమెని దారుణంగా రేప్‌ చేశారు. విషయం తెల్సుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బుధవారం పుదుచ్చేరి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏడుగురు నిందితుల గాలింపు చేపట్టారు..