ప్రేమకు ఏదీ అడ్డే కాదని లవర్స్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు.ప్రపంచ దేశాలు దాటుతూ తమ ప్రేమను నిజం కూడా చేసుకుంటున్నారు.
జాతి, కులం, మతం, ప్రాంతం ఇలా వేటితో సంబంధం లేకుండా తమ ప్రేమికులతో కలిసి బతికితే చాలు అనుకుంటున్నారు.ఈ మాటలన్నిటికీ తాజా ఉదాహరణగా పోలాండ్‌కు( Poland ) చెందిన బార్బరా అనే మహిళ నిలుస్తోంది.
బార్బరాకి, భారతదేశానికి చెందిన షాదాబ్‌కి 2021లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త స్నేహానికి దారి తీసింది.
అనంతరం వారు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.బార్బరాకు అన్య అనే ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది.
ఆమెకు ఆల్రెడీ పెళ్లయి విడాకులు తీసుకుంది.అయినా బార్బరాను తానేంతో ప్రేమిస్తున్నానని, ఆమె కూతుర్ని కూడా చూసుకుంటానని షాదాబ్( Shadab ) చెబుతున్నాడు.ఆమెతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాడు.అతను ఆమెకు మంచి, చెడు సమయాల్లో అండగా ఉండాలని అనుకుంటున్నాడు.

షాదాబ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం బార్బరాకు( Barbara Polak ) నచ్చలేదు, కానీ వారు దాని గురించి మాట్లాడుకున్నారు.అతను ఆ అలవాటు మానేయడానికి అంగీకరించాడు.షాదాబ్ ముంబైలో సినిమాల్లో కెరీర్ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడు ఆ ప్రయత్నాలు కూడా మానుకొని పోలాండ్ లో జాబ్ చేయడానికి అతను సిద్ధమయ్యాడు.బార్బరా కూడా షాదాబ్‌ను తెగ ప్రేమిస్తోంది.అతని స్వస్థలమైన జార్ఖండ్‌లోని( Jharkand ) హజారీబాగ్‌కు కూడా ఆమె వచ్చింది.
బార్బరాకి ఈ ప్లేస్ నచ్చింది కానీ ఆమె రద్దీగా ఉండే ప్రదేశాల కంటే ప్రశాంతమైన ప్రదేశాలను ఇష్టపడుతుంది.

వేర్వేరు దేశాలకు చెందిన వీరిద్దరూ త్వరలోనే ఒక కోర్టులో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ కూడా చేస్తున్నారు.బార్బరా పోలాండ్‌లో పని చేస్తుంది.షాదాబ్ అద్భుతమైన వ్యక్తి అని బార్బరా భావిస్తుంది.
భారతీయుల పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని ఆమె అంటోంది.ఆమె పోలాండ్‌లో ఒక ప్రైవేట్ సంస్థను కలిగి ఉంది.2027 వరకు భారతదేశంలో ఉండటానికి వీసాను కూడా తీసుకుంది.షాదాబ్, బార్బరాల గురించి తెలుసుకున్న ఇండియన్స్ వారిది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని కామెంట్ పెడుతున్నారు.