కూరగాయల సంచిలో బతికున్న పాము... ఉలిక్కిపడ్డ మహిళ ఏం చేసిందంటే...?

ఆస్ట్రేలియాలోని ఒక మహిళకు వింత అనుభవం ఎదురైంది.సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసిన సంచితో సదరు మహిళ భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది.4 కిలోల బంగాళదుంపలను సంచితో పాటు కొనుగోలు చేసిన మహిళ ఆ సంచిలో బతికున్న పాము ఉండటంతో భయభ్రాంతులకు లోనైంది.ఆమె తన ఫేస్ బుక్ పేజీలో తను ఎదుర్కొన్న అనుభవాన్ని షేర్ చేసింది.
పూర్తి వివరాలలోకి వెళితే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన మారిస్సా దెవిడ్ అనే మహిళ గత వారం సూపర్ మార్కెట్ కు బంగాళదుంపలను కొనుగోలు చేయడానికి వెళ్లింది.అక్కడ సంచితో సహా కొన్న బంగాళాదుంపలను ఇంటికి తీసుకొచ్చింది.

 Woman Finds Live Snake In Potatoes Bag Australia-TeluguStop.com

బంగాళదుంపలను తీసే సమయంలో సంచిలో పాము ఉండటంతో మహిళ షాక్ కు గురైంది.సంచిలో ఉన్న పాము బయటకు వచ్చి ఆమె కుమారుడి వైపు పాకింది.

కూరగాయల సంచిలో బతికున్న పాము

కుమారుడికి పాము అపాయం తలపెడుతుందని భావించిన మహిళ వెంటనే వాక్యూమ్ క్లీనర్ సహాయంతో పామును చంపేసింది.చనిపోయిన పాము ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.తాను చాలా భయంకరమైన ఘటనను ఫేస్ చేశానని.తనకు సరిగ్గా నిద్ర కూడా రావడం లేదని అన్నారు.విషయం తెలిసిన వెంటనే సూపర్ మార్కెట్ నిర్వాహకులు సదరు మహిళను కలిసి క్షమాపణలు కోరారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube