వామ్మో.. బెడ్ కింద 18 పాములను చూసిన మహిళ.. చివరికి !

ఒక మహిళ బెడ్ కింద పాములను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది.తన ఇంట్లో తన బెడ్ కింద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 పాములను చూసి ఒక్కసారిగా భయంతో కేకలు వేయడం మొదలు పెట్టింది.

 Woman Finds Family Of 18 Snakes Living Under Her Bed, Snakes Under Bed, Georgia,-TeluguStop.com

ఒక్క పామును చూస్తేనే మనం భయంతో పరుగులు తీస్తాము.అలాంటిది ఏకంగా 18 పాములను ఒకేసారి చుస్తే అక్కడే భయంతో చచ్చిపోవడం ఖాయం.

అలంటి ఘటనే ఆ మహిళకు ఎదురైంది.వాళ్ళ బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి అని వచ్చేసరికి ఆమెకు బెడ్ కింద పాములు కనిపించడంతో భయంతో కేకలు వేయడంతో ఆమె భర్త ఏమైందో అని పరుగున వచ్చే సరికి పాములను చూసి అతడు కూడా భయ పడ్డాడు.

అన్ని పాములు తమ రూమ్ లోకి ఎలా వచ్చాయో ఆ దంపతులకు అర్ధం కాలేదు.ఈ ఘటన జార్జియాలో జరిగింది.

ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి సమయంలో తన బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి బెడ్ ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో అలికిడి అవ్వడంతో దగ్గరగా వెళ్లి చూసింది.ఆ మహిళకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంతో కేకలు వేయడంతో ఆమె భర్త రూమ్ లోకి వచ్చి పాము పిల్లను చూసాడు.ఆ పాము పిల్లను చుసిన ఆమె భర్త ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని చూడగా.

ఆ బెడ్ కింద తల్లి పాముతో పాటు పాము పిల్లలు కూడా ఉన్నాయి.వెంటనే అతడు ఆ పాములను ఒక్కొక్కటిగా పట్టుకుని సంచిలో వేసాడు.ఆ పాములు మొత్తం పెట్టుకున్నాక వాటిని లెక్కపెడితే మొత్తం 18 పాములు ఉన్నట్టు ఆ దంపతులు గుర్తించారు.

అలా పట్టుకున్న పాములను అడవిలో వదిలేసారు.ఆ తర్వాత ఈ సమాచారాన్ని స్నేక్ రెస్క్యూ టీమ్ ఆ ఇల్లంతా గాలించారు.

ఇల్లంతా వెతికాక ఇంకా ఎక్కడ పాములు లేవని చెప్పడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.కొద్దీ రోజుల క్రితమే ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేశామని అప్పుడే ఆ పాములు వచ్చి ఉంటాయని ట్రిస్ తెలిపింది.

అన్ని పాములను చూసేసరికి ఒక్కసారిగా భయం వేసిందని ఇంట్లో ఉండాలంటేనే దడ పుడుతుందని ఆమె చెబుతుంది.వామ్మో మనింట్లో మనకు తెలియకుండా ఏదైనా జరగవచ్చు అందుకే కాస్తా జాగ్రత్తగా ఉండడం మంచిది.

https://www.facebook.com/trish.wilcher/posts/10225913487293724

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube