కొత్త కారు అని చెప్పి సెకండ్ హ్యాండ్ కారును అంటగట్టిన షోరూం సిబ్బంది..

జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత వాహనం ఉండాలని కోరుకుంటారు.అందుకోసం డబ్బులు కూడబెడుతుంటారు.

 Woman Anusha Mukkera Filed A Case On Showroom Owners For Selling Second Hand Car-TeluguStop.com

ఎవరి తాహతకు తగిన వాహనం వారు కొనుకుంటారు.చాలా మందికి ఒక కారు కొనుక్కోవాలని.

తాము డ్రైవ్ చేసుకుంటూ తమ కుటుంబ సభ్యులతో రైడ్ కు వెళ్లాలని అనుకుంటుంటారు.మన కొత్త కారును ఎవరైనా అడిగితే ఇవ్వడానికి పదిసార్లు ఆలోచిస్తాము.

అలాంటిది మనం కొత్తదని కొనుకున్న కారు ఇంతకు ముందు ఎవరైనా వాడారని తెలిస్తే ఎలా ఉంటుంది.ఇలాంటి ఒక చేదు అనుభవం ఒక మహిళకు ఎదురైంది.కొత్త కారు కొన్నానని ఆనందపడేలోపే సెకండ్ హ్యాండ్ కారని తెలిసి ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది.ఈ సంఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే జరిగింది.

అనుషా ముక్కెర అనే మహిళ కొండాపూర్ లో నివాసముంటుంది.ఆమె బంగారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో మోరీస్ గ్యారేజెస్ కు గత సంవత్సరం డిసెంబర్ లో వెళ్ళింది.

ఆ షోరూం నిర్వాహకులకు ఒక కారు కొనాలనుకుంటున్నట్లు తెలిపింది.

Telugu Banjara Hills, Filed, Hyderabad, Mg, Nusha Mukkera, Showroom-Latest News

దీంతో ఆమెకు ఆ షోరూం వారు ఎంజీ జేఎస్ ఈవీ ఎక్స్ క్లూజివ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని చూపించారు.ఆ కారు 24.50 లక్షలకు కొనుక్కునేందుకు ఆమె అంగీకరించి 50 వేల రూపాయలు అడ్వాన్సు కింద ఇచ్చింది.ప్రోసెస్ అంత అయిపోయిందని చెప్పి జనవరి 5న షోరూం నిర్వాహకులు ఆమెకు కారును అందించారు.

కారు కొన్నప్పుడే టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలను షోరూం వారు అందించాల్సి ఉండగా వారు ఆ సమయంలో అందించలేదు.

అయితే ఆ విషయంపై ఆమె ఎప్పుడు మాట్లాడిన తొందర్లోనే పంపిస్తాం.ప్రోసెసింగ్ లో ఉంది అని చెప్పేవారు.ఆమె కూడా కారు వచ్చిందిగా అని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఈ సమయంలోనే ఆమె కారు వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయ్యిందని సర్వీసింగ్ కోసమని ఇచ్చింది.

కాగా సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఆ బిల్లు చూసి ఆమె అవాక్కయింది.ఆ బిల్లులో తన పేరుకు బదులు వేరే వ్యక్తి పేరు ఉండడం చూసి ఏమయిందో అర్ధం కాలేదు.

సర్వీసింగ్ నేను ఇస్తే వేరే వ్యక్తి పేరు ఉందేంటని నిలదీయడంతో సిబ్బంది అసలు విషయం చెప్పారు.ఈ కారు వేరే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయిందని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది.

దీంతో ఆమెకు మోసపోయానని అర్ధం అయ్యింది.వేరొకరి కారు తనకు ఇచ్చారని.

అందుకే రిజిస్ట్రేషన్ పేపర్స్ విషయంలో ఆలస్యం చేస్తున్నారని తెలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube