వైరల్ వీడియో : కూతురి పాటకు పై నుంచి ఊడిపడ్డ తల్లి!

మనలో చాలామంది పాటలు పాడటాన్ని ఎంతో ఇష్టపడతారు.కొందరు అందరి ముందు పాడటానికి ఇష్టపడితే కొందరు మాత్రం ఎవరూ లేని సమయంలో పాటలు పాడుతూ వింటారు.

 Woman Falls Through Ceiling Video Viral-TeluguStop.com

కొందరైతే ఏకంగా సింగింగ్ లోనే కెరీర్ ను ఎంచుకుంటూ ఉంటారు.తాజాగా ఒక యువతి కూడా సింగింగ్ లో రాణించాలని అనుకుంది.

అందుకోసం ఒక పాటను ఎన్నో రోజుల పాటు సాధన చేసింది.కానీ ఊహించని ఘటన వల్ల ఆ యువతి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.

 Woman Falls Through Ceiling Video Viral-వైరల్ వీడియో : కూతురి పాటకు పై నుంచి ఊడిపడ్డ తల్లి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లిజ్ సాన్ మిలాన్ అనే యువ‌తి స్థానికంగా జరుగుతున్న ఒక మ్యూజిక్ అడిషన్ కు ఎంపిక కావడం కోసం ఒక పాటను వీడియో రూపంలో పాడి పంపించాలని అనుకుంది.అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకుంది.

కెమెరా ముందు గొంతు సవరించుకుని పాట పాడటం మొదలుపెట్టగానే గదిలోని సీలింగ్ నుంచి తల్లి కాళ్లు బయటకు కనిపించాయి.ఆ తర్వాత ఆమె పై నుంచి కింద పడింది.

ఊహించని ఈ ఘటన వల్ల షాక్ కు గురైన యువతి ఏం చేయాలో పాలుపోక కెమెరాను వెంటనే ఆఫ్ చేసింది.

లిజ్ సాన్ మిలాన్ ఈ ఘటన గురించి స్పందిస్తూ తాను ఏదో పని చేస్తున్నాననే విషయం తెలిసి కూడా తల్లి అటకపైకి ఎక్కిందని….

అమ్మ కింద పడే వరకు ఎటువంటి శబ్దం వినిపించలేదని… అమ్మ పై నుంచి కింద పడినా ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని… ప్రస్తుతం తల్లి సురక్షితంగానే ఉందని పేర్కొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్లు ” కూతురి శ్రమను తల్లి నవ్వుల పాలు చేసింది” అని, ” మిలాన్ పాట పాడితే ఇంటి పునాదులే కదులుతున్నాయని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.

#Falls #Mother #Music #Tiktok #San Millan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు