లేని క్యాన్సర్‌ ఉందని చెప్పి కుటుంబ సభ్యులను మోసం, రెండు కోట్లు వెనకేసుకుంది.. ఎందుకిలా అంటే ఏం చెప్పిందో తెలుసా?

డబ్బు గడ్డి తినిపిస్తుందనే సామెత ఊరికే రాలేదు.డబ్బు సంపాదన కోసం కొందరు చేసే పనులు అసహ్యంగా అనిపిస్తాయి.

 Woman Faked Brain Cancer Conned Family For 2 5 Lakh Pounds-TeluguStop.com

కొన్ని సార్లు డబ్బు కోసం చెప్పే అబద్దాలు మామూలుగా ఉండవు.డబ్బు కోసం ఇతరుల వద్ద నటించే వారు ఎక్కువ మంది ఉంటారు.

కాని సొంత వారి వద్ద నటించి రెండు కోట్ల రూపాయలను వెనకేసుకున్న కిలాడీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంది.

యూకేలో ఉంటున్న ప్రవాస భారతీయురాలైన జాస్మిన్‌ తనకు క్యాన్సర్‌ ఉంది అంటూ భర్తను మరియు ఇతరును మోసం చేసి ఏకంగా రెండు కోట్ల రూపాయలను వెనకేసుకుంది.ఆ డబ్బు సంపాదన కోసం ఆమె తాను ప్రాణాలు కోల్పోబోతున్నట్లుగా చెప్పింది.కన్నీటి కథ చెప్పి డబ్బు సంపాదించిన ఆమె ప్రస్తుతం కటకటాలు లెక్కపెడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… లండన్‌లో ఉండే జాస్మిన్‌ అనే యువతి చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అతడిని వదిలేసింది.ఆ తర్వాత మళ్లీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత తనకు క్యాన్సర్‌ ఉందని, అందుకు డబ్బు కావాలని భర్తను కోరింది.అతడు అయ్యో అనుకుని భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడం స్టార్ట్‌ చేశాడు.ఇందుకోసం జాస్మిన్‌కు ఒక డాక్టర్‌ సాయం చేశాడు.డాక్టర్‌ కు జాస్మిన్‌ భర్త భారీ మొత్తంలో డబ్బు ఇచ్చాడు.

ఆ తర్వాత డాక్టర్‌ జాస్మిన్‌ మాజీ భర్తకు ఫోన్‌ చేశాడు.ఆమె పరిస్థితి బాగాలేదని, క్యాన్సర్‌ ముదిరిందని, అయితే వైధ్యం చేస్తే ఆమె బతికే ఛాన్స్‌ ఉందని చెప్పాడు.అప్పుడే జాస్మిన్‌ కూడా మాజీ భర్తకు ఫోన్‌ చేసి తన పరిస్థితి బాగాలేదని చెప్పింది.

దాంతో పాటు ఒక ఎక్స్‌రే పిక్‌ను కూడా పంపించింది.దాంతో కరిగి పోయిన ఆ వ్యక్తి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చాడు.

అలా ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఆమెకు జమ అయ్యాయి.జాస్మిన్‌ మాజీ భర్తకు అనుమానం వచ్చి తన స్నేహితురాలి ద్వారా ఎంక్వౌరీ చేయగా ఆమెకు క్యాన్సర్‌ లేదని తేలిపోయింది.

దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.రెండు కోట్ల రూపాయలు ఎందుకు మీరు కావాలనుకున్నారు అంటే రెండవ భర్తతో తాను విడాకులు తీసుకోవాలనుకున్నాను, ఆయన నుండి విడిపోయిన తర్వాత లగ్జరీగా బతికేందుకు అలా చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube