సమాజంలో ఆడవారిపై వివక్ష ఎలా ఉంటుందో ఈ కథ చూడండి.

ఇది నా కథ… నాకు పెళ్లి చేస్తే భారం తీరుతుంది అని నా తల్లిదండ్రులు సంబంధాలు వెతకడం మొదలెట్టారు.మా నాన్న ఒక రిక్షా నడిపేవాడు.

 Emotional Story Of A Woman, Society, Woman, Husband, Rapes, Woman Emotional Stor-TeluguStop.com

మాకు వచ్చే సంబంధాలు కూడా ఆ పరిధిలోవే.ఎట్టకేలకు ఒక సంబంధం ఖాయమైంది.

ఆడపిల్లకు పెళ్లిపై ఎన్నో ఆశలు ఉంటాయి అలాగే నాకు కూడా నా పెళ్లిపై ఎన్నో ఆశలు ఉండేవి.పెళ్లైన మొదటి రాత్రి పడక గదిలోకి తాగి వచ్చాడు నా భర్త.జీవితాంతం గుర్తుండిపోవాల్సిన శోభనాన్ని మానభంగంగా మార్చేశాడు అతను.16 ఏళ్ల వయసులో నొప్పితో అల్లాడిపోయాను.అతను తాగిన మత్తులో నాపై ఇంకా ఊగుతూ పోయాడు.సరిగ్గా నెల తరువాత అతను స్నేహుతుడితో వచ్చి అతను డబ్బులు ఇచ్చాడు అని, కాబట్టి నన్ను అతనితో ఒక రాత్రి గడపమని చెప్పాడు.

కోపంతో అరిచాను.ఇద్దరు కలిసి నన్ను కొట్టారు.

వచ్చిన వాడు కోరిక తీర్చుకున్నాడు.ఏడాదిన్నర తరువాత నెలలు నిండాయి.

డెలివరీ అయ్యింది.దేవుడికి అదే పనిగా మొక్కుకున్నాను.

ఆడపిల్ల వద్దని.దేవుడు మోర ఆలకించలేదు.

ఆడపిల్లే పుట్టింది!

నా కూతురికి 12 ఏళ్ల వయసులో ఇలాగే ఇంకో స్నేహితుడిని తీసుకొచ్చి నా కూతురి గదిలోకి పంపే ప్రయత్నం చేసాడు నా భర్త.నాకు నా గతం గుర్తొచ్చింది.

కూరగాయలు కోసే కత్తితో వాళ్ళిద్దరిని తరిమేశాను.వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాళ్లపై కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసాను.

సమాజంలో ఇపుడు నేను ఒక చెడ్డదానిని.భర్త ను జైలుకు పంపిన పాపిష్టిదానిని.

ఎన్నో మాటలు.ఎన్ని భూతులు.

అయిన నాకు సంతోషంగా ఉంది.నా కూతురి జీవితాన్ని కాపాడినందుకు.

నేను చేసిన పని తప్పు అని ఏరోజు అనుకోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube