వైరల్ వీడియో: చీర ధరించి జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్న మహిళ..!

మన భారత సాంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొంత మంది మహిళలు చీర ధరించడానికి ఇబ్బందులు పడుతున్న కానీ.

 Woman Doctor Doing Workouts With Saree In Gym Viral Video-TeluguStop.com

సాంప్రదాయానికి విలువనిచ్చి చీరను ధరించడం మాత్రం మానరు.మరికొంతమంది మహిళలు అయితే చీరలో చేసే అద్భుతమైన విన్యాసాలను మనం గమనిస్తూనే ఉంటాం.

కొంతమంది మహిళలు చీరలు ధరించే రేసులో పాల్గొనడం, డ్యాన్స్ చేయడంలో పాండిత్యం కలిగి ఉంటే లాంటివి నిత్యం మనం గమనిస్తూనే ఉంటాం.

 Woman Doctor Doing Workouts With Saree In Gym Viral Video-వైరల్ వీడియో: చీర ధరించి జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్న మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉండగా తాజాగా చెందిన ఒక ప్రముఖ డాక్టర్ చీర ధరించి చేసే విన్యాసాలు అంతా ఇంతా కాదు.

చాలా సులువుగా చీరలోనే జిమ్ కు వెళ్ళడంతో పాటు భారీ స్థాయిలో ఉన్న బరువులను ఎత్తడం వర్క వుట్స్ చేయడం లాంటివి చేసేస్తుంది.ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా.? పూణెకి చెందిన ప్రముఖ డాక్టర్.ప్రస్తుతం చీరకట్టులో ఆమె చేసిన వర్కౌట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.37 సంవత్సరాలు గల డాక్టర్ షార్వారీ ఇనామ్‌ దార్ ఆయుర్వేద వైద్యురాలు.

ఆమె ఫిట్నెస్ విషయంపై అనేక జాగ్రత్తలు పాటించడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార దినచర్యను తప్పక పాటిస్తుంది.ఇక డాక్టర్ షార్వారీ జిమ్ లో చీరలు ధరించి చేసిన వీడియో సోషల్ మీడియాలో చూసి షాక్ అవుతున్నారు.చాలా సులువుగా చీరలో ఇలా వర్కవుట్ చేయడం ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ డాక్టరమ్మ పుష్ అప్స్, వర్క్ ఔట్స్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను వీక్షించండి.

#Viral Workouts #Instagram #Viral Video #ViralDoctor #Doctor Sharwari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు