హాస్పిటల్ వద్దని...యూట్యూబ్ వీడియో చూస్తూ డెలివరీ! కానీ చివరికి ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు!

వంటలు, అల్లికల వంటి వాటికోసం యూట్యూబ్‌ వీడియోలు ఫాలో కావడం సహజం.త్రీ ఇడియట్స్ సినిమాలో వీడియో కాల్ లోనేమన ఆమిర్ ఖాన్ డెలివరీ కూడా చేసేస్తారు.

 Woman Dies During Childbirth After Home Delivery Done With Help Of Youtube Vide-TeluguStop.com

కానీ త మిళనాడులో ఓ గర్భిణి కాన్పు ఎలా చేసుకోవాలనే విషయమ్మీద యూట్యూబ్‌ వీడియోను ఫాలో అయింది.పురిటి నొప్పులతో బాధపడుతున్నా.ఆ వీడియోలోని సూచనలతో ఇంట్లోనే బిడ్డను జన్మనిచ్చేందుకు ప్రయత్నించి ప్రాణాలు విడిచింది.వీడియోల్లోని సూచనలతో ఇంట్లోనే పురుడు పోసింది మరెవరో కాదు.స్వయంగా ఆమె భర్తే.! వివరాల లోకి వెళ్తే.!

రుప్పూర్‌ జిల్లాలో ఆలస్యంగా ఈ విషాదం వెలుగుచూసింది.పుదుపాళయానికి చెందిన కృతిక(28), కార్తికేయన్‌(34) దంపతులకు మూడేళ్ల పాప ఉంది.అప్పట్లో కృతికకు ఇంట్లోనే సుఖప్రసవం జరిగింది.కృతిక రెండోసారి గర్భం దాల్చడంతో ఈసారి కూడా ఇంట్లోనే ప్రసవం జరగాలని కార్తికేయన్‌ దంపతులు భావించారు.దీనికి కార్తికేయన్‌ కుటుంబసభ్యులూ మద్దతు పలికారు.గర్భం దాల్చింది మొదలు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, మందులేవీ వాడకుండా యూట్యూబ్‌ వీడియోల సూచనలనే పాటిస్తూ వచ్చారు.

ఇది ఇలా ఉండగా జూలై 22న కృతికకు పురిటినొప్పులు వచ్చి బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.వీడియోల సహాయంతో ఇంట్లోనే డెలివరీ చేయాలనుకున్నారు.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే పరిస్థితి విషమించడంతో కృతిక మృతిచెందింది.ఈ నేపథ్యంలో కృతిక భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube