అప్పు తీర్చలేదని 7 నెలల గర్భిణిని తన్నారు… చివరకు?  

woman delivers stillborn after neighbours kick her in abdomen, Ghajiyabadh, Pregnant Women, Sanjay Borrow The Money, Police Superindent Abhishek Varma, LOck Down, neighbours kick her in abdomen - Telugu Ghajiyabadh, Lock Down, Neighbours Kick Her In Abdomen, Police Superindent Abhishek Varma, Pregnant Women, Sanjay Borrow The Money

దేశం అభివృద్ధి పరంగా ఎంత ముందుకెళుతున్నా దేశంలో అమానుష ఘటనలు మాత్రం ఆగడం లేదు.మహిళల విషయంలో కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు.

 Woman Delivers Stillborn After Neighbours Kick Her In Abdomen

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా అమానుష ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

అప్పు తీర్చలేదనే నెపంతో ఒక వ్యక్తి గర్భిణి పొత్తికడుపుపై తన్నాడు.

అప్పు తీర్చలేదని 7 నెలల గర్భిణిని తన్నారు… చివరకు-General-Telugu-Telugu Tollywood Photo Image

బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని ఘజియాబాద్ ప్రాంతంలోని గుంకా గ్రామంలో సంజయ్ వర్మ అనే వ్యక్తి తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు.సంజయ్ వృత్తిరిత్యా ఒక ప్రైవేట్ కంపెనీలో చాలీచాలని జీతంతో పని చేసే వాడు.

అయితే గతేడాది ఊహించని కష్టాలు ఎదురు కావడంతో పొరుగున నివాసం ఉంటున్న వ్యక్తి నుంచి సంజయ్ 1,20,000 అప్పుగా తీసుకున్నాడు.

అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ అప్పును తీర్చడం సంజయ్ వర్మకు సాధ్యం కాలేదు.

అప్పు తీసుకునే సమయంలో సంజయ్ పొరుగింటి వ్యక్తికి తనఖా కింద భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఇచ్చాడు.అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల జీతం మరింత తగ్గడంతో సంజయ్ అప్పును తీర్చలేకపోయాడు.

దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తితో పాటు మరో ఆరుగురు సంజయ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేయడంతో పాటు గర్భవతి అయిన అతని భార్య కడుపుపై కాలితో తన్నారు.

దీంతో ఆమె నరకయాతన అనుభవించింది.

సంజయ్, ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా కడుపులోకి బిడ్డ చనిపోయిందని తేలింది.అమానుషంగా దాడి చేయడం వల్లే భార్య మృతి చెందిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తరువాత సంజయ్, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ చనిపోయిన శిశువు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.

#Pregnant Women #Ghajiyabadh #NeighboursKick #Lock Down #SanjayBorrow

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Delivers Stillborn After Neighbours Kick Her In Abdomen Related Telugu News,Photos/Pics,Images..