పాపం ఆ గర్భిణీ.. కరోనా పరీక్ష చేయిస్తేనే కాన్పు అన్నారు.. చివరికి?

ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన కరోనా కరోనా, ఎం చేసిన కరోనా, ఆరోగ్యం బాలేదని చికిత్స కోసం వెళ్తే కరోనా పరీక్షా అంటారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

 Woman Delivers Baby While Standing In Queue For Covid Test , Pregnant Women, Cor-TeluguStop.com

పాపం.పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి దారుణమైన అనుభవం ఎదురైంది.

కరోనా పరీక్షా చేయిస్తేనే కాన్పు చేస్తాం అని చెప్పింది వైద్య సిబ్బంది.

అయితే కరోనా పరీక్షకు 1500 రూపాయిలు అవుతాయి అని చెప్పడంతో భార్యను క్యు లైన్ లో నిలబెట్టి భర్త డబ్బు తీసుకురావడానికి వెళ్ళాడు.

అయితే కరోనా పరీక్షల క్యూ లో నించున్న ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యిది అక్కడే కూలబడి తన బిడ్డకు జన్మనిచ్చింది.ఇంకా ఊహించని ఈ పరిణామంతో ఉలిక్కిపడిన ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన తల్లీబిడ్డలను ఓ వార్డుకు తరలించారు.

ఇంకా ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.నిజానికి ఆమె ఆస్పత్రికి చేరే సమయానికే పురిటి నొప్పులు మొదలయ్యాయి అని ఆమె భర్త, దినసరి కూలీ రమణ్ దీక్షిత్ చెప్పుకొచ్చాడు.

ఇంకా ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు కరోనా పరీక్షలు చేస్తేనే చేర్చుకుంటామని గైనకాలజీ ఎమర్జెన్సీ వార్డు సిబ్బంది చెప్పారు అని చెప్పాడు.

కాగా డబ్బు కోసం వెళ్లిన అతను తిరిగి వచ్చే సరికి అతని భార్య ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పాడు.

కాగా ప్రస్తుతం తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు ఆర్ఎంఎల్ఐఎమ్ఎస్ ఆస్పత్రి ప్రతినిధి డాక్టర్ శ్రీకేశ్ సింగ్ తెలిపారు.కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ కోరిన ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నూజాత్ హుస్సేన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube