ఇదేందయ్యా ఇది: కోడలు కోసం ఏకంగా నాలుకనే?

కాలం మారింది.అంతా టెక్నాలజీ పైనే నడుస్తుంది.

 Woman Cuts Tongue Gods Daughter In Law-TeluguStop.com

అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులు ఇవి.అలాంటి ఈ రోజుల్లో కూడా కొందరు ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు.నమ్మడం మాత్రమే కాదు వారికి వారే హాని చేసుకుంటున్నారు.కంప్యూటర్ కాలం వచ్చినా మనిషి మాత్రం మారలేకపోతున్నాడు.

ఇంకా ఈ మూఢనమ్మకంతోనే ఓ మహిళ తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి పూజలు చేస్తూ ఆమె నాలుకను సమర్పించింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఈ ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా – ఖర్సావన్ జిల్లాలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఆదివారం చోటు చేసుకుంది.

 Woman Cuts Tongue Gods Daughter In Law-ఇదేందయ్యా ఇది: కోడలు కోసం ఏకంగా నాలుకనే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఎన్‌ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా అనే మహిళ కోడలు ఈ నెల 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది.ఇంకా ఆరోజు నుంచి బయటకు వెళ్లి వెతకడం మానేసి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది.శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె నాలుక కత్తరించుకుంది.

నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికి ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు.అయితే స్థానికులు ఆమెకు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు తెలిపారు.

అయితే తప్పిపోయిన ఆమె కోడలు జ్యోతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

#Law #Woman #Cuts Tongue #Gods

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు