దేవుడా: ఇన్సూరెన్స్ కోసం చేతిని కట్ చేసుకున్న మహిళ... కాకపోతే చివరకు..?

ఈ మధ్యకాలంలో కష్టపడి జీవించే వారి కంటే పక్క వారిని మోసం చేసి సుఖంగా జీవించే వారు ఎక్కువ అయిపోయారు.మోసం చేయడం ఒక కళ గా భావించి మోసపూరిత పద్ధతులను ఉపయోగించి తాము సుఖంగా ఉండాలనుకునే వారు చాలామంది ఎక్కువైపోయారు.

 Young Woman Who Cut Off Hand For Insurance Payout, Insurance Money, Julija Adles-TeluguStop.com

ఇక ఇదే నేపథ్యంలో తాజాగా మోసం చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని ఓ మహిళ ఏకంగా తన ఎడమ చేతిని కట్ చేసుకుంది.చేయి కట్ చేసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని ఓ మహిళ భావించగా, ఆమెకు కోర్టులో గట్టి షాక్ ఎదురైంది.

అంతేకాదు ఆమె అధికారులను మోసం చేసినందుకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు.ఇక ఇందుకు సహకరించిన తన బాయ్ ఫ్రెండ్ కూడా కోర్టు మూడు సంవత్సరాల శిక్షను విధించింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే…

స్లోవేనియా దేశానికి చెందిన జూలిజా అడ్లెసిక్ అనే 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయి గత సంవత్సరం 5 ఇన్సూరెన్సు పాలసీలను చేసింది.ఇలా ఇన్సూరెన్స్ చేసిన తర్వాత వాటిని క్లైమ్ చేసుకుందామని దురుద్దేశంతో తనంతట తానే రంపంతో తన ఎడమచేతిని కోసుకుని హాస్పిటల్లో జాయిన్ అయింది.

అయితే ఇందుకు సంబంధించి చెట్టు కొమ్మలను కట్ చేస్తున్న టైం లో ఈ సంఘటన చోటుచేసుకుందని అధికారులను నమ్మించే ప్రయత్నం చేసింది.ఇందులో భాగంగా కట్ చేసుకున్న చేతిని అక్కడే వదిలేసి రావడం ద్వారా వైద్యులు తనకు శాశ్వత అంగవైకల్యం నిర్ధారిస్తారని దాంతో ఇన్సూరెన్స్ లో చాలా సులువుగా జరిగిపోతుందని భావించింది.

అయితే ఈ కేసు నిమిత్తం పోలీసులు ఆ చేతి భాగాన్ని స్వాధీనం చేసుకొని తిరిగి ఆ అమ్మాయికి ఆ చేతిని అతికించడం లో విజయవంతం సాధించారు.అయితే ఈ సంఘటనకు ముందు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆర్టిఫిషల్ చేతులకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన సంగతి అధికారులు గుర్తించారు.

ఇంకేముంది ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసిందని ఆధారాలు సేకరించారు అధికారులు.అయితే విచారణలో తనకు ఏమాత్రం నేరం తెలియదు అన్నట్టుగా అమాయకత్వాన్ని ప్రదర్శించిన ఆ అమ్మాయి.

తాను ఉద్దేశ్యపూర్వకంగా చేతిని కత్తిరించుకోవాలను కోలేదని, ఎవరు కూడా అంగవైకల్యం కావడానికి ఇష్టపడని ఆవేదన వ్యక్తం చేసింది.ఆ సంఘటన ఎలా జరిగిందో నాకు మాత్రమే తెలుసు అంటూ అధికారులను నమ్మించడానికి ప్రయత్నం చేసింది.

అయితే అధికారులు ఇచ్చిన పూర్తి ఆధారాలతోనే సదరు అమ్మాయికి, తన బాయ్ ఫ్రెండ్ కు జైలు శిక్ష విధించింది కోర్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube