గర్భందాల్చిన కొద్దిరోజులకే మళ్ళీ గర్భవతి అయిన మహిళ..

అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి.వాటినే వింటే మనం అస్సలు నమ్మలేము.

 Woman Conceived A Second Child While She Was Already Pregnant, Unusual Phenomeno-TeluguStop.com

మనం నమ్మలేకపోయిన అవి నిజాలే.ఇప్పుడు చెప్పబోయే వార్త కూడా అలాంటిదే.

మనం విన్న వెంటనే ఆశ్చర్యపోతాము.ఒక మహిళ కడుపులో బిడ్డ పెరుగుతుండగానే మళ్ళీ గర్భం దాల్చింది.

అవును ఇది నిజమే.ఒక మహిళకు కొద్దీ రోజులక్రితమే ప్రెగ్నన్సీ వచ్చింది.ఒక బిడ్డ కడుపులో ఉండగానే మరోసారి ప్రెగ్నన్సీ వచ్చింది.దీనిని వైద్య భాషలో డబల్ ప్రెగ్నన్సీ అని అంటారట.

ఈ విచిత్రం ఇంగ్లాండ్ లోని ట్రౌబ్రిడ్జ్‌లో చోటుచేసుకుంది.

ఇంగ్లాండ్ లోని ట్రౌబ్రిడ్జ్‌లో నివసిస్తున్న రెబక్కా రోబెర్ట్స్అనే మహిళకు 39 సంవత్సరాలు.

ఈ వయసులో ఈమెకు డబల్ ప్రెగ్నెన్సీ వచ్చింది.ఈమెకు ఒక కూతురు కూడా ఉంది.

ఆమెకు 14 సంవత్సరాలు.అయితే ఇటీవల రెబక్కా కు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది.

మూడు వారాలు వచ్చిన తర్వాత కడుపులో మరొక బిడ్డ ఉందని తెలిసి రెబక్కా ఆశ్చర్య పోయింది.గతంలో చేయించుకున్న రెండు స్కాన్లలో ఒక్క బిడ్డే ఉందని వైద్యులు తెలిపారు.

ఇప్పుడు కవలలు అని చెప్పేసరికి రెబక్కా నమ్మలేదు.ఆమె మళ్ళీ పరీక్షలు చేయించుకుంది.

వైద్యులు గర్భం రావడానికి వదిన మందుల కారణంగానే ఆమెకు డబల్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పారు.ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న సమయంలోనే మరో అండం విడుదలై ఉంటుందని అందుకే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిపారు.ఇప్పటికీ వైద్యులు డబల్ ప్రెగ్నెన్సీ కి పూర్తి కారణాలు ఏమిటో అంచనా వేయలేకపోతున్నారు.

2020 సెప్టెంబర్ నెలలో రెబక్కా కవల పిల్లలకు జన్మనిచ్చింది.ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించారు.అందులో అమ్మాయి వీక్ గా ఉండడం వల్ల కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో హాస్పిటల్ లోనే ఉంచారు.చిన్నారి పూర్తిగా కోలుకున్న తర్వాత డిసెంబర్ 25 న డిశ్చార్జ్ చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube