మలక్ పేట్ ఏసీపీ పై జాతీయ ఎస్సీ కమీషన్ లో ఫిర్యాదు..!

కులం పేరుతో దూషిస్తూ ఇంట్లో నుండి కార్పొరేటర్ గెంటేయడంతో ఆయనపై చర్యలు చేపట్టమని మలక్ పేటలో కేసు పెట్టారు ఎం.పద్మ.

 Woman Complaint Against Malakpet Acp-TeluguStop.com

అయితే కేసుని పట్టించుకోకపోవడంతో మలక్ పేట ఏసీపీపై బాధితురాలు జాతీయ ఎస్సీ కమీషన్ లో ఫిర్యాదు చేశారు.వనస్థలిపురం బీ.ఎన్.రెడ్డి నగర్ కాలనీలో ఉంటున్న ఎం.పద్మ సైదాబాద్ ఇంద్రప్రస్థ కాలనీలో సుప్రియా రెడ్డి ఇంట్లో బేబీ కేర్ టేకర్ గా పనిచేస్తుంది.ఈ నెల 15న సుప్రియా రెడ్డి బంధువు మధు ఎలాంటి కారణం లేకుండా పద్మపై దాడి చేశాడు.

ఈ విషయాన్ని సుప్రియా రెడ్డికి పద్మ చెప్పింది అయినా సరే తన దగ్గరి బంధువులైన బండంగ్ పేట కార్పొరేటర్ శోభ ఆనంద్ రెడ్డి దంపతులు ఇంతర కుటుంబ సభ్యులను పిలిపించి పద్మ మీద గొడవకు దిగింది.కార్పొరేటర్ దంపతులు బాధితురాలిని కులం పేరుతో దూషితూ ఇంట్లోంచి మెడపట్టి బలవంతంగా తోసేశారు.

 Woman Complaint Against Malakpet Acp-మలక్ పేట్ ఏసీపీ పై జాతీయ ఎస్సీ కమీషన్ లో ఫిర్యాదు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాధితురాలు డయల్ 100కి ఫోన్ చేయగా సైదాబాద్ పోలీసులు అక్కడకి వచ్చారు.పోలీసుల ముందే పద్మని చంపుతానని అన్నారు కార్పొరేటర్ దంపతులు.

బాధితురాలి ఫిర్యాదు ఈ నెల 15న చేయగా పోలీసులు నిర్లక్ష్య విఖరి ఆమెని ఇబ్బంది పెట్టింది.అందుకే ఆమె జాతీయ ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

కార్పొరేటర్ భర్తకు రాజకీయ పలుబడి వల్లే వాళ్లని అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆరోపించింది.వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలు పద్మ కోరింది.

#Complaint #M Padma #Woman #Malakpet Acp #NationalSc

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు