ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో 41 ఏళ్ల రష్యన్ మహిళ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చిన తాత్యన అనే రష్యన్ మహిళ లక్నౌ లోని వ్రిన్ దావన్ ధామ్ బిల్డింగ్ లో గత ఏడాది ఫిబ్రవరి నెల నుంచి నివసిస్తోంది.
ఈ బిల్డింగ్ లో ఎక్కువగా రష్యన్ భక్తులు నివసిస్తూంటారు.అందుకే దీన్ని రష్యన్ బిల్డింగ్ అని కూడా అంటుంటారు.
అయితే పోలీస్ అధికారులు ఢిల్లీలో ఉన్న రష్యన్ ఎంబసీ అధికారులకు తాత్యన మరణవార్తను అధికారులు చేరవేశారు.ఈమె స్వస్థలం రష్యాలోని యారోస్లావ్ ఓబ్లాస్ట్లోని రోస్టోవ్ పట్టణం అని తేలింది.
అయితే రష్యన్ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటని పోలీసులు విచారిస్తున్నారు.
పోలీసుల విచారణ లో తాత్యన శ్రీకృష్ణుడి భక్తురాలు అని తేలింది.
సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎంపీ సింగ్ చెప్పిన ప్రకారం.తాత్యన కి స్నేహితురాలైన మరొక రష్యా మహిళ కూడా అదే బిల్డింగ్ లో నివసిస్తోంది.
అయితే తాత్యన శ్రీకృష్ణుడిని కలుసుకోవాలని చాలా రోజులుగా తనతో చెబుతుందని ఆమె చెప్పింది.ప్రతిరోజు రాత్రి కలలోకి శ్రీకృష్ణుడు వస్తున్నాడని కూడా తాత్యన చెప్పినట్టు స్నేహితురాలు వెల్లడించింది.
తాత్యన శ్రీకృష్ణుడి వద్దకు శాశ్వతంగా వెళ్లిపోవాలని శనివారం రోజు ఆరు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఉంటుందని తన స్నేహితురాలు అనుమానం వ్యక్తం చేసింది.
అయితే పోలీసులు కూడా తాత్యన మూఢ భక్తితోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ప్రాథమిక విచారణలో తెలిపారు.అలాగే ఆమె అపార్ట్మెంట్ ను సీల్ చేసి ఏవైనా అనుమానాస్పద ఆధారాలు దొరుకుతాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.అలాగే శవపరీక్ష నిమిత్తం తాత్యన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు.ఏది ఏదైనా కృష్ణుడిపై అమితమైన ప్రేమ ఉన్న రష్యన్ మహిళ చనిపోవడం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.