సుశాంత్ చనిపోయాడని యువతి ఆత్మహత్య

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.అయితే సుశాంత్ ఆత్మహత్య వెనకా ఎదైనా బలమైన కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 Woman Commits Suicide In Vizag, Sushanth Singh Rajput, Woman, Suicide, Vizag-TeluguStop.com

కాగా ఆయన తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.సుశాంత్ మృతిపట్ల పలువురు సెలెబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఓ మహిళా అభిమాని తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైజాగ్‌లో చోటు చేసుకుంది.బీహార్ నుండి విశాఖపట్నం శ్రీహరిపురంకు వలస వచ్చి ఉంటున్న కుటుంబానికి చెందిన ఓ యువతి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది.

అయితే లాక్‌డౌన్ కారణంగా స్కూలుకు సెలవులు ఉండటంతో ఇంటి వద్దే ఉంటూ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందట.కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంటే ఇష్టమైన ఆ యువతి ఆయన ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోయిందని, అప్పట్నుండి కుటుంబ సభ్యులతో ఎక్కువ మాట్లాడకుండా ఉండేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక టిక్‌టాక్‌లో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన వీడియోలను ఎక్కువమొత్తంలో చూసి తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆ యువతి ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube