విడ్డూరం : చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేశారు.. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చింది

కొన్ని సంఘటనలు చాలా వింతగా అనిపిస్తాయి.అప్పుడప్పుడు చనిపోయారనుకుని అంత్యక్రియలకు సిద్దం చేస్తున్న సమయంలో లేవడం, చనిపోయారని భావించి పూడ్చి పెట్టిన తర్వాత కూడా లేవడం వంటివి జరిగాయి.

 Woman Come Back After Two Years Family Members Thought She Is Dead-TeluguStop.com

ఇలాంటి వార్తలు మనం ఇప్పటి వరకు ఎన్నో చూశాం.ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఒకటి మీ ముందుకు తీసుకు వచ్చాను.

ఒక మహిళ రెండు సంవత్సరాల క్రితం చనిపోయిందని భావించి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యి అంత్యక్రియలు, కర్మఖాండ నిర్వహించడం జరిగింది.అంత్యక్రియలు పూర్తి అయ్యి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి అందరిని ఆశ్చర్య పర్చింది.

విడ్డూరం : చనిపోయిందనుకుని అం�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మన తెలుగు రాష్ట్రమే అయిన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లింది.భర్త, పిల్లలను వదిలి కువైట్‌ వెళ్లిన ఆమె సంవత్సరం పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఎప్పటికప్పుడు తన వివరాలను వెళ్లడించడం చేసింది.కాని సడన్‌గా కొన్నాళ్ల నుండి ఆమె కాల్స్‌ లేవు, ఆమె ఎక్కడ ఉందో స్నేహితుల ద్వారా కూడా సమాచారం అందలేదు.ఆమె పని చేసే చోట సంప్రదిస్తే కొన్నాళ్ల క్రితమే ఆమె జాబ్‌ మానేసినట్లుగా అక్కడ చెప్పారు.

విడ్డూరం : చనిపోయిందనుకుని అం�

అసలు విషయం ఏంటీ అంటే జాబ్‌ చేస్తున్న వద్ద యజమాని వేదింపులు ఉన్న కారణంగా ఎవరికి చెప్పకుండా మరో చోట జాబ్‌లో చేరింది.కొత్త జాబ్‌ అడ్రస్‌ మరియు వివరాలను ఇండియన్‌ ఎంబసిలో నమోదు చేయాల్సి ఉంటుంది.కాని అలా చేయలేదు.కొత్త జాబ్‌ గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు.ఒక రోజు ఉద్యోగంకు వెళ్లి వస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ అయ్యింది.దాంతో ఆమెను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు.

కోమాలోకి వెళ్లిన ఆమె వివరాలు ఏమీ తెలియరాలేదు.స్థానిక ఇండియన్స్‌ ఆమె గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.

ఆమె వేలి ముద్రలతో పాస్‌ పోర్ట్‌ వివరాలు తెలుసుకుని ఆమెను పంపించాలని ప్రయత్నించినా కూడా వీలు పడలేదు.చివరకు రెండు సంవత్సరాల సుదీర్ఘ కోమా తర్వాత ఆమె లేచింది.

విడ్డూరం : చనిపోయిందనుకుని అం�

ఆమె వివరాలు చెప్పిన నేపథ్యంలో ఇండియన్‌ ఎంబస్సి స్వయంగా సొంత ఖర్చులతో ఆమెను ఇండియాకు పంపడం జరిగింది.ఇండియాకు ఆమెతో సహా ఒక నర్స్‌ను కూడా పంపించడం జరిగింది.ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు నర్స్‌ వెంకటలక్ష్మిని అప్పగించి కువైట్‌ చేరుకుంది.చనిపోయిందనుకున్న భార్య కళ్ల ముందు కనిపించడంతో అతడు షాక్‌ అవ్వగా, ఆమె కొడుకు ఆనందంకు అవధులు లేకుండా పోయాయి.

ఇక ఆమె కుటుంట సభ్యులు ఇతరులు కూడా చాలా సంతోషించారు.చాలా కాలం కోమాలో ఉన్న కారణంగా ఆమె పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది.అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని వైధ్యులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube