వైరల్ వీడియో: అయ్యయ్యో.. స్టంట్ ఫెయిల్ అయిన అమ్మాయి.. చివరికి..?!

సోషల్ మీడియా అంటేనే అదొక గమ్మత్తైన లోకం.చాలా మంది బతుకుదెరువు కోసం అందులో కష్టపడుతుంటారు.

 Woman Climbing Tree Fallen Chair Stunt Failed-TeluguStop.com

ఇంకొందరు వినోదం కోసం అందలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు.ఇంకొందరు దానిని వ్యసనంలా అలవాటుచేసుకుంటూ ఉంటారు.

ప్రపంచంలో ఏం జరిగినా సోషల్ మీడియా అనేది క్షణంలో దానిని వైరల్ చేసి అందరికీ తెలిసేలా చేసేస్తుంది.అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అని కొందరు అదేపనికి ఎదురుచూస్తుంటారు.

 Woman Climbing Tree Fallen Chair Stunt Failed-వైరల్ వీడియో: అయ్యయ్యో.. స్టంట్ ఫెయిల్ అయిన అమ్మాయి.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు చాలా వరకూ వినోదభరితంగా ఉంటాయి.కొన్ని నవ్వులు తెప్పిస్తుంటే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

యువత అయితే తాము చేసే ఏ పని అయినా సోషల్ మీడియాలో పెట్టడం అలవాటుగా చేసుకుంటున్నారు.ఇటువంటి తరుణంలో తాజాగా ఓ వీడియో వైరల్ అయ్యింది.

స్టంట్స్‌ చేస్తూ చెట్టెక్కాలని భావించిన యువతి ఇలా వెల్లకిలా పడిపోయింది.ముందుగా చెట్టు కొమ్మ కిందిభాగంలో ఓ కూర్చి వేసుకుంది.

దానిపై నిలబడి చెట్టేక్కేందుకు రెడీ అయ్యింది.

కానీ, ప్రయత్నం బెడిసి కొట్టి ఇలా కూర్చిలోనే పడిపోయింది.

దీంతో ఆ కూర్చి కూడా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది.సదరు యువతికి దెబ్బ కూడా సాలీడ్‌గానే తగిలి ఉంటుంది పాపం.

మొత్తానికి ఏదో చేయాలని భావించి సర్కాస్‌ ఫీట్లు చేయబోయింది.కానీ, ప్లాన్‌ రివర్స్‌ అయింది పాపం అంటూ నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఫన్నీ కామెంట్స్‌ చేస్తూ వీడియోను వైరల్‌గా మార్చేశారు.సాధారణంగా చాలా మంది తాము చేసే స్టంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టి పాపులారిటీ పొందాలని అనుకుంటుంటారు.

దీనివల్ల వారు ప్రపంచంలో మంచి గుర్తింపు పొందుతారు కూడా.అయితే వారు పెట్టే వీడియోల్లో కొన్ని మాత్రం బెడిసికొడుతుంటాయి.

తమ వీడియోలు ఇలా అయ్యాయని వారు బాధపడరు.మళ్లీ ఓసారి ప్రయత్నించాలని ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

#Viral Video #WomanClimbing #Stuns Fail #Social Media #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు