అందచందాలు లైవ్‌లో చూపిస్తానంటూ వలపు వల: ఎన్ఆర్ఐకి పట్టరాని ఆనందం, ఏం చేశాడంటే..!!

ఎన్ఆర్ఐలను వివిధ రూపాల్లో మోసం చేసే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువవుతోంది.ఎక్కడో సూదర ప్రాంతాల్లో ఉండటంతో మంచి పెళ్లి సంబంధం కోసమో, మరేదైనా పని కోసం ఇక్కడి వారిపై ఆధారడుతున్నారు ప్రవాస భారతీయులు.

 Nri Cheated By Cyber Criminal In The Name Of Woman Video Call In Vizianagaram, V-TeluguStop.com

వారి బలహీనతలను అవకాశంగా తీసుకుంటున్న కొందరు అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు కొకొల్లలు.తాజాగా వెబ్‌సైట్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలతో ఓ ఎన్ఆర్ఐని నిలువునా దోపిడి చేశారు కేటుగాళ్లు.

విజయనగరానికి చెందిన ఓ యువతి ఓ వెబ్‌సైట్‌లో తన ఫోటోలతో పాటు అడ్రస్ పెట్టడంతో ఎన్ఆర్ఐ యువకుడు దాని ద్వారా సంప్రదించాడు.తియ్యని వాయిస్‌తో వలపు మాటలు చెప్పిన యువతి అతడిని తన బుట్టలో వేసుకుంది.

అలా ప్రతిరోజూ వారిద్దరూ ఛాటింగ్ చేసుకునేవారు.ఈ క్రమంలోనే రూ.8,500 పంపిస్తే వీడియో కాల్‌లో నగ్నంగా కనిపిస్తానని ఆమె చెప్పడంతో సదరు ఎన్ఆర్ఐ సంబరపడిపోయాడు.పట్టరాని సంతోషంలో రూ.8,500కు బదులు పొరపాటుగా రూ.85,000 పంపించాడు.

కాసేపటికి తేరుకున్న ఆ యువకుడు ఈ విషయాన్ని చెబుదామని ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది.సరే అని అప్పటికి వదిలేసినా.రెండు, మూడు రోజుల పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ యువతి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని చాలా ఆలస్యంగా గ్రహించాడు.అనంతరం విజయనగరం పోలీసులకు మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు .మాయ లేడి కోసం గాలింపు చేపట్టారు.ఆన్‌లైన్‌లో ట్రాప్ చేసి డబ్బు దోచుకునే కేటుగాళ్ల పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube