కలికాలం : మోజు తీర్చుకుని,  డబ్బు గుంజేసి యువకుడిని రోడ్డుపై వదిలేసిన యువతి…  

Woman Cheated A Boy For Money In Bangalore - Telugu Bangalore, Crime News, Karnataka, Love, Woman Cheating

ప్రస్తుత కాలంలో కొందరు యువతులు ప్రేమ పేరుతో అమాయకపు యువకులను వలలో వేసుకొని కపట ప్రేమని ఒలకబోస్తూ అందినకాడికి డబ్బు గుంజుతూ  చివరికి మోజు తీరిపోయాక ప్రేమించిన వారిని రోడ్లపై వదిలేస్తున్నారు.తాజాగా ఓ యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి యువకుడిని ప్రేమ పేరుతో వలలో వేసుకొని దాదాపుగా 16 లక్షల రూపాయలకు పైగా కాజేసి చివరికి అతడిని రోడ్డుపై వదిలేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Woman Cheated A Boy For Money In Bangalore

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి ఓ యువకుడు బెంగళూరు పరిసర ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.అయితే ఇతడికి మాట్రిమోనియల్ మాధ్యమాల ద్వారా ఓ యువతి ఇటీవలే పరిచయం అయింది.

ఈ పరిచయం కాస్త ప్రేమ కి దారి తీసింది.ఈ  క్రమంలో యువతి అప్పుడప్పుడు తాను కష్టాల్లో ఉన్నానని మరియు తన కుటుంబ సభ్యులకు ఇప్పుడు చాలా డబ్బులు అవసరమని చెబుతూ దాదాపుగా 16 లక్షల రూపాయలకు పైగా యువకుడి నుంచి తీసుకుని ఇప్పుడు పెళ్లి విషయం ఎత్తగానే మొహం చాటేస్తోంది.

కలికాలం : మోజు తీర్చుకుని,  డబ్బు గుంజేసి యువకుడిని రోడ్డుపై వదిలేసిన యువతి…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తాజాగా మరో మారు పెళ్లి గురించి యువతీ యువకులు మధ్య పెద్ద గొడవ జరిగింది.ఈ గొడవలో భాగంగా యువతి యువకుడిని పెళ్లి చేసుకోవడం కుదరదని నిర్మొహమాటంగా చెప్పేసింది.దీంతో యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.అంతేగాక ప్రేమ పేరుతో వంచించినటువంటి ఆ యువతికి శిక్ష పడాలని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి యువతి పై ఫిర్యాదు నమోదు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న టువంటి యువతి పరార్ అయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Cheated A Boy For Money In Bangalore Related Telugu News,Photos/Pics,Images..

footer-test