మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి.ఈ నేపథ్యంలో ఎలెక్షన్స్ ఫలితాలు రావడంతో అక్కడ పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశాడు.
కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని కండిషన్స్ తో కూడిన పర్మిషన్ మాత్రమే ఇచ్చాడు.సోషల్ డిస్టెన్స్ పాటించాలి, విదిగా మాస్క్ ధరించాలి.
అయిదు గురు కంటే ఎక్కువగా సంబరాలు చేసుకోకూడదు.జనాలు గుంపులు గుంపులు గా ఒక్కదగ్గరకు చేరకూడదు అంటూ జిల్లా కలెక్టర్ ఆంక్షలు విధించాడు.
ఈ నేపథ్యంలో ఓ భార్య, సర్పంచ్ గా గెలిచిన తన భర్తను భుజలపై మోసుకొని ఊరంతా ఊరేగించి సంబరాలు చేసింది.ఆ వివరాలు అక్కడ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోని ఫలితాలు సోమవారం నాడు రావడంతో ఖేల్ తాలూకాలోని “పలు” గ్రామానికి చెందిన సంతోష్ సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందాడు.
దీంతో ఆయన భార్య రేణుకా సంతోషం పట్టలేక భర్తను భుజలపై ఎత్తుకొని ఊరేగించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది.