భార్యతో కలిసి మందు సిట్టింగ్ వేసిన భర్త... కానీ చివరికి... 

ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇతరులు బలవుతున్నారు.కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్యపై లేనిపోని అనుమానాలు పెంచుకుని మద్యం మత్తులో దారుణంగా దాడి చేశాడు.

 Woman Brutally Attacked By Her Husband For Unnecessary Doubts-TeluguStop.com

దీంతో ప్రస్తుతం ఆ వివాహిత చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన మీరట్ పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో విరాజ్ (పేరు మార్చాం) అనే వ్యక్తి తన భార్య మరియు కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

 Woman Brutally Attacked By Her Husband For Unnecessary Doubts-భార్యతో కలిసి మందు సిట్టింగ్ వేసిన భర్త… కానీ చివరికి… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీరాజ్ కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి ఓ  ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.కాగా విరాజ్ కి అందమైన భార్య, మంచి జీతం, పెద్ద ఉద్యోగం వంటివాటితో జీవితం చాలా చక్కగా సాగిపోతోంది.

సరిగ్గా ఇదే సమయంలో విరాజ్ కి తన భార్య నేహాపై అనుమానం మొదలైంది.ఈ క్రమంలో విరాజ్ తన భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తనలో తానే మదనపడుతూ ఉండేవాడు.

దీనికి తోడు తన భార్య కూడా రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో ఈ అనుమానం రోజురోజుకీ మరింత బలమైంది.

కాగా తాజాగా విరాజ్ తన భార్యతో కలిసి మద్యం సేవించాడు.ఈ క్రమంలో నేహా దాదాపుగా గంట సేపు పాటూ ఫోన్ మాట్లాడింది.దీంతో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ అంటూ నేహా ని వీరాజ్ నిలదీసాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మరోమారు వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ గొడవ లో భాగంగా తీవ్ర ఆగ్రహానికి గురైన విరాజ్ తన భార్యపై చేతికందిన కత్తితో దారుణంగా దాడి చేశాడు.

అయితే ఆమె కేకలు విన్నవిరాజ్తల్లి నేహా ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించింది.అనంతరం నేహా తల్లిదండ్రులు పోలీసులకి సమాచారం అందించి విరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.

#WomanBrutally #Meerat #WomanBrutally

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు