విడ్డూరం: లిప్‌లాక్ పెట్టింది.. నాలుక తెగింది!

సాధారణంగా ప్రేమికులు ముద్దుల్లో మునిగిపోయినప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతారు.ఈ క్రమంలో వారు ముద్దులు పెట్టుకుంటూ తమ ప్రేమను ఆస్వాదిస్తుంటారు.

 Woman Bit Off Man Tongue While Lip Lock-TeluguStop.com

కానీ ఓ ప్రేమజంట మాత్రం తమ ముద్దు కారణంగా వార్తల్లో నిలిచారు.అలాగని వారేమీ రికార్డు స‌ృష్టించలేదు.

ఆ ప్రియురాలు పెట్టిన ముద్దుకు సదరు ప్రియుడి నాలుక తెగిపడింది.

అమెరికాలోని డెట్రాయిట్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్త వివరాల్లోకి వెళ్తే, యూలెట్ వెడ్జ్‌వార్త్(52) అనే మహిళ తన ప్రియుడి ముద్దు పెట్టుకోవాలని కోరడంతో సరే అంది.

అయితే ముద్దు పెట్టేటప్పుడు నాలుక బయటకు తీయవద్దని ఆమె అతడిని హెచ్చరించింది.అయినా వినని ఆ ప్రియుడు ముద్దు పెట్టుకునే సమయంలో నాలుకను బయటకు తీయడంతో ఆమెకు అసహ్యం కలిగింది.

దీంతో ఆమె అతడి నాలుకను గట్టిగా కొరికింది.

Telugu Lip Lock, Tongue, Weird-Telugu NRI

కాగా ఆ ప్రియుడి నాలుగ తెగిపడటంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా యూలెట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ నెల 19న ఈ కేసు విచారణ జరగనుండగా, ఆమె నేరం రుజువైతే ఆమెకు ఏడాది జైలు శిక్ష పడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube