పురుషుల క్రికెట్ లో అంపైర్ గా మహిళ..!

సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం అయ్యింది.మొదటి రోజే ఆస్ట్రేలియా జట్టు ఇండియా పై ఆధిపత్యం చెలాయించింది.

 Inida, Austraila, Women, Umpire, Third Test, Cricket ,indian Cricket,austalia Cr-TeluguStop.com

మొదటి రోజు ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా టీం రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.మార్నస్‌ లబుషేన్(67; 149 బంతుల్లో 8×4)‌, స్టీవ్‌స్మిత్‌(31; 64 బంతుల్లో 5×4) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది.అదేంటంటే చరిత్రలో మొట్టమొదటి సారిగా పురుషుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఒక మహిళా అంపైర్ విధులు నిర్వర్తించారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్లెయిర్ పోలోసాక్ సిడ్నీ లో జరుగుతున్న టెస్టులో ఫోర్త్ అంపైర్ గా వ్యవహరిస్తున్నారు.

పాల్ రీఫెల్, పాల్ విల్సన్ మెయిన్ అంపైర్లు గా వ్యవహరిస్తుండగా.

బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ థర్డ్ అంపైర్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ ముగ్గురు అంపైర్ లతో పాటు ఫోర్త్ అంపైర్ గా క్లెయిర్ పోలోసోక్ మ్యాచ్ నిర్వహణలో భాగమయ్యారు.

Telugu Austraila, Cricket, Inida, Umpire-Latest News - Telugu

గతంలో క్లెయిర్ పోలోసాక్ మెన్ వన్డే క్రికెట్ లో అంపైర్ గా వ్యవహరించి.పురుషుల వన్డే క్రికెట్ కి మొట్టమొదటి మహిళా అంపైర్ గా గుర్తింపు దక్కించుకున్నారు.ఆమె 2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 పోటీల్లో నమీబియా, ఒమన్ క్రికెట్ టీమ్స్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కి అంపైర్ గా చేశారు.మళ్లీ 2021 సంవత్సరం లో ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కి ఆమె అంపైర్ బాధ్యతలు వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

అయితే తాను ఒక్కరే కాదని భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది మహిళలు క్రికెట్ మ్యాచ్ లకు అంపైర్లు అవుతారని ఆమె అన్నారు.

టెస్ట్ క్రికెట్ మ్యాచ్లకు ఫోర్త్ అంపైర్ లను ఏ దేశంలో ఆడితే ఆ దేశం వారే నియమించుకుంటారు.

ఆస్ట్రేలియా వారు పోలోసాక్ ను ఈసారి నియమించుకున్నారు.కొత్త బాల్స్ తీసుకురావటం, మిగతా అంపైర్ లకు డ్రింక్స్ తెచ్చివ్వడం, లైట్ మీటర్లలో బ్యాటరీ చెక్ చేయడం, లంచ్ బ్రేక్ సమయాల్లో పిచ్ పై ఎటువంటి చెత్తాచెదారం పడకుండా ఉండేలా ఫోర్త్ అంపైర్ విధులు నిర్వహిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube