సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన మహిళ అరెస్ట్.. ?

ఎన్నికల్లో స్దానికులకే దిక్కులేదు ఎక్కడో దేశం కానీ దేశం నుండి వచ్చి పోటీచేసి అందులో గెలిస్తే మన భారతీయులు ఊరుకుంటారా ఊరుకోరు కదా! మరి ఏం చేశారో తెలుసుకుందాం.

 Woman Arrested For Taking Charge As Sarpanch, Woman Sarpanch, Arrested, Up, Paki-TeluguStop.com

ఈ మధ్య కాలంలో యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పాక్ కు చెందిన బానో బేగమ్ గడావు అనే మహిళ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది.

అయితే ఆమె పుట్టుపుర్వోత్తరాలను బయటకు తీసిన స్దానికులకు ఈ మహిళ పాకిస్దాన్ దేశస్తురాలని తేలిసిందట.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, జలేసర్ పోలీసులు జనవరి 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ విషయం తెలిసిన బానో బేగం తనను అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోయింది.అలా సుమారుగా నెలన్నర రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందట.

చివరికి ఆ మహిళ ఆచూకి కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారట.ఈ విషయాన్ని ఈతాహ్ జిల్లా ఎస్ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.

ఇకపోతే పాక్ కు చెందిన ఈ మహిళ 1980, జూన్ 8న జిల్లాకు చెందిన అఖ్తర్ అలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చి అప్పటి నుండి తన వీసాను పొడిగించుకుంటూ ఇక్కడే ఉండిపోయిందని పోలీసులు తెలియచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube