మహిళా వ్యాపారవేత్త చేతిలో మోసపోయిన టాలీవుడ్ హీరోలు.. ఏకంగా 200కోట్లు!

Woman Arrested For Cheating Celebrities In Hyderabad

మాయగాళ్లు.రోజురోజుకూ మోసాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు.పోలీసులు ఎంత అరికడుతున్న రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి.మోసపోయే వారు ఉన్నంతకాలం మోసాలు జరుగుతూనే ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.ఈ మాటలు నిజంగా నిజమే.ప్రజలకు ఆశచూపి వారిని అమాయకులను చేసి వారిని నిలువునా దోపిడీ చేస్తున్నారు.

 Woman Arrested For Cheating Celebrities In Hyderabad-TeluguStop.com

తాజాగా ఒక మహిళ వ్యాపారవేత్త ఘరానా మోసానికి పాల్పడింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్లకు పైగానే కుచ్చు టోపీ పెట్టింది.అయితే ఈమె వలలో టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ఈమె మోసమైన మాటలను నమ్మి ఉన్నదంతా ఆమె చేతిలో పెట్టారు.

దీంతో ఆమె అందిన కాడికి పుచుకుంది.అధిక వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మించింది.

 Woman Arrested For Cheating Celebrities In Hyderabad-మహిళా వ్యాపారవేత్త చేతిలో మోసపోయిన టాలీవుడ్ హీరోలు.. ఏకంగా 200కోట్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Hyderabad, Shilpa, Tollywood-Latest News - Telugu

తాజాగా మోసాలకు పాల్పడుతున్న శిల్పా అనే మహిళ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసారు.ఈమె మోసం చేసిన లిస్టులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ఈ లిస్టులో టాలీవుడ్ కు చెందిన ముగ్గురు హీరోలు కూడా ఉన్నట్టు సమాచారం.అధిక వడ్డీ ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వారి దగ్గర నుండి తీసుకుని అందరిని నమ్మించి మోసం చేసినట్టు తెలుస్తుంది.

సాధారణ ప్రజలతో పాటు సినీ హీరోలు కూడా ఈ లిస్టులో ఉండడం అందరిని షాక్ కు గురి చేస్తుంది.ఫేజ్ త్రీ పార్టీలు ఇచ్చి మరి సెలెబ్రిటీలను ఆకర్షించి ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం అందరిని మోసం చేసి దాదాపు 100 నుండి 200 కోట్ల రూపాయల వరకు దోచుకున్నట్టు తెలుస్తుంది.

బాధితులంతా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంటి ఆమెతో పాటు ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసారు

.

#Shilpa #Hyderabad #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube