ఈ అమెరికా మహిళ దొంగకి చుక్కలు చూపించింది

దొంగతనాలు జరగకుండా యజమానులు సీసీ కెమెరాలు పెట్టి ఎన్నో జాగ్రత్తలు పడుతున్నా సరే దొంగలు మరింత తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు.ముఖానికి మాస్కు పెట్టుకుంటూ సీసీ కెమెరాలకి ముఖాలు కనబడకుండా విలువైన వస్తువులు దర్జాగా దోచుకు పోతున్నారు.

 Woman Ambushes Thieves With Motion Activated Sprinkler-TeluguStop.com

ఇలాంటి వారిని పట్టుకోవటం పోలీసులకు సైతం పెద్ద తలనొప్పిగా మారిపోయింది.అయితే అమెరికాలోని ఓ మహిళ తన అద్భుతమైన ఐడియా తో దొంగను తరిమి తరిమి కొట్టింది ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వివరాల్లోకి వెళితే

అమెరికాలోని కాలిఫోర్నియాలో రాత్రి సమయంలో ఇళ్ళ ముందు ఉన్న కార్ల లో విలువైన విడిభాగాలను దోచేస్తున్నారు దొంగలు.

పోలీసులు ఎంతగా పట్టుకుందామని ప్రయత్నాలు చేసినా వారు మాస్కులు ధరించి ఉండటంతో వారిని పట్టుకోవటం కష్టతరమవుతుంది అని గ్రహించిన ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది వెంటనే తన ఆలోచనను తన ఇంటి నుంచి అమలు చేసింది.అదేంటంటే

బాగా ప్రెషర్ తో కూడుకున్న మిషన్ యాక్టివేటెడ్ స్ప్రింక్లర్ లను తన కారులో ఏర్పాటు చేసింది.

ఎవరైనా తన కారు దగ్గరకు చేరుకున్న వెంటనే ఆ స్ప్రింక్లర్లు వేగంగా నీటిని చిమ్ముతాయి.ఇది తెలియని ఓ దొంగ ముఖానికి మాస్కు ధరించి సైకల్ పై ఆ కారు దగ్గరకు వచ్చాడు, వచ్చీ రాగానే స్ప్రింక్లర్లు యాక్టివేట్ అయ్యి అతనిపై నీళ్లను వేగంగా చిమ్మేశాయి.

దాంతో ఒక్క సారిగా కంగారు పడిన దొంగ సైకిల్ పై వేగంగా వెళ్లిపోయాడు.ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు ఆమె తెలివి తేటలకి హాట్స్ హాఫ్ చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube