చీర కట్టుకుందని మహిళను అవమానించిన రెస్టారెంట్.. నెటిజెన్స్ ఫైర్!

మన దేశంలో చీర కట్టుకు ఎంతో గౌరవం ఉంది.మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా మన వస్త్రధారణ అంటే చాలా మందికి ఇష్టం.

 Woman Alleges Delhi Restaurant Refused Entry As She Wore Saree-TeluguStop.com

అక్కడి విదేశీయులు కూడా మన కట్టుబొట్టుకు విలువనిస్తారు.అయితే ఈ చీర కట్టుకు మన దేశంలోనే అవమానం జరిగింది.

అది కూడా దేశ రాజధాని అయినా ఢీల్లీ లో.ఒక మహిళ చీర కట్టుకుని రెస్టారెంట్ కు వెళ్లిందని అక్కడి రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెను హోటల్ లోనికి పంపించలేదు.

 Woman Alleges Delhi Restaurant Refused Entry As She Wore Saree-చీర కట్టుకుందని మహిళను అవమానించిన రెస్టారెంట్.. నెటిజెన్స్ ఫైర్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చెయ్యడంతో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వేడెక్కింది.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మన సంస్కృతిని మనమే గౌరవించకపోతే ఎలా అని నెటిజెన్స్ నిలదీస్తున్నారు.ఢీల్లీ లోని ఒక మాల్ లో ఉన్న రెస్టారెంట్ కు ఒక మహిళ చీర కట్టుకుని వచ్చింది.

దీంతో ఆమెను రెస్టారెంట్ సిబ్బంది లోపలి అనుమతించకుండా అక్కడే ఆపేసారు.

చీర క్యాజువల్, స్మార్ట్ డ్రెస్ కోడ్ కిందకు రాదని ఆమెను అనుమతించమని సిబ్బంది తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె నెటిజెన్స్ ను అడిగింది.మీ దృష్టిలో స్మార్ట్ అవుట్ ఫిట్ అంటే అర్ధం ఏంటని ఆమె ప్రశ్నించింది.

ఈ పోస్ట్ లో ఆమె ఢీల్లీ పోలీస్ కమిషనర్, అమిత్ షా, మహిళా కమిషనర్ ను యాడ్ చేసింది./br>

ఆమె ఒక జర్నలిస్ట్ కావడంతో ఆమె విసుగుచెంది ఆ ఉందంతన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఈ వీడియో చుసిన నెటిజెన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చీర కట్టుకుంటే రెస్టారెంట్ లోకి అందుకు అనుమతించలేదో అర్ధం కాలేదు అని ఆమె తెలిపింది.ఇలా చీర కట్టుకుని వెళ్తే అవమానించడం చాలా అమానుషమైన ఘటనగా నెటిజెన్స్ భావిస్తున్నారు.

వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

#AllegesDelhi #Delhi #Restaurant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు