హెల్మెట్ లేదని బైక్ నిలిపిన పాపానికి ఆ మహిళ  

Woman Abuses To A Man In Delhi Traffic Signals-

ఈ రోజుల్లో పురుషులే కాదు మహిళలు కూడా మద్యం సేవించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది.ఒకేవేళ తాగితే తాగారు కానీ ఇలా రోడ్లపై పోలీసులతో గొడవలు పడి వారిపై చేయి కూడా చేసుకుంటున్నారు.ఈ ఘటన తాజాగా దేశ్ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకుంది..

Woman Abuses To A Man In Delhi Traffic Signals--Woman Abuses To A Man In Delhi Traffic Signals-

వివరాల్లోకి వెళితే….ఢిల్లీ లోని మాయాపూరి లో అనిల్ పాండే,మాధురి దంపతులు కలిసి యాక్టివా పై వెళుతుండగా,ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించలేదని ఆపారు.దీనితో మద్యం మత్తులో ఉన్న మాధురి ఏకంగా ట్రాఫిక్ పోలీస్ పైనే దాడికి దిగింది.ఈ క్రమంలో అనిల్‌ పాండే కల్పించుకొని.

తామిద్దరం పార్టీలో ఉండగా.మాధురి సోదరుడు చనిపోయాడని ఫోన్‌ వచ్చింది అందుకే తాము త్వరగా వెళ్లాలి అంటూ అతడు పోలీసులను కోరాడు.ఐతే పోలీసులేమో బైక్‌ను రోడ్డు పక్కకు పార్క్‌ చేయాలని అనిల్‌ను ఆదేశించడం తో గొడవ ప్రారంభమై మాధురి దాడి వరకు దారి తీసింది.

ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వారిపై కూడా మాధురి దాడి చేయడం గమనార్హం.మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దాడికి సంబందించిన దృశ్యాలు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.

మరోపక్క పోలీసులపై దాడి చేసిన అనిల్,మాధురి లను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్టు తెలుస్తుంది.గతంలో కూడా ఇలాంటి ఘటనలే ఒకటి రెండు చోటుచేసుకున్నాయి.తాగిన మత్తులో మహిళలు ఇలా పోలీసులపై దాడి చేయడం జరిగింది..

ఐతే ఈ తాజా ఘటనతో పోలీసులు సీరియస్ గా తీసుకొని వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.