రెండో ప్రపంచ యుద్ధం( Second World War ) ప్రపంచ వ్యాప్తంగా తీరని విషాధాన్ని నింపింది.లక్షల కొద్దీ సైనికులు, ప్రజలు చనిపోయారు.
ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు నాశనం అయ్యాయి.అణుబాంబుల వల్ల కొన్ని దేశాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్థం అయింది.
తీరని ప్రాణనష్టం ఏర్పడింది.ఆ ప్రపంచ యుద్ధాల తాలూకా అనుభవాలు, నేటికీ వెంటాడుతుంటాయి.
అయితే రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులతో కలిసి ఓ ఎలుగుబంటి కూడా పోరాడింది.వారితో కలిసి జీవించింది.
దాని జీవితం ఇప్పటికే ఒక డాక్యుమెంటరీని రూపొందించారు.దాని పేరు వోజ్టెక్.1941లో జర్మన్ దండయాత్ర తర్వాత రష్యా( Russia ) విడుదల చేసిన పోలిష్ సైనికులు ఐరోపాకు తిరిగి వచ్చే మార్గంలో మధ్యప్రాచ్యం గుండా వెళుతున్నారు.అలాంటి పర్యటనలో కొత్త సభ్యులను తీసుకురావడం అసాధారణం కాదు, కానీ వోజ్‌టెక్( Wojtek ) పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది.
ఎందుకంటే అతను ఎలుగుబంటి.వోజ్‌టెక్ తల్లిని వేటగాళ్లు కాల్చి చంపారు.

అది చిన్నతనంలో ఉన్నప్పుడే సైనికులు( Soldiers ) దానిని కొనుగోలు చేశారు.అది వారితో పాటు ఇరాక్, ఈజిప్టు వరకు వెళ్లింది.1943లో యూరప్‌కు ఓడ ఎక్కేందుకు, కొన్ని నిబంధనలు అడ్డు వచ్చాయి.దీంతో వోజ్‌టెక్‌కు సైనికుడి హోదా కల్పించారు.
దానికి సీరియల్ నంబరుతో పాటు పే బుక్ కూడా ఇచ్చారు.అది జంతువు కాబట్టి దానికి ప్రత్యేకమైన చెక్క పెట్టెను నిద్రపోవడానికి తయారు చేయించారు.
అయితే వోజ్టెక్ మాత్రం సైనికులతో పాటు కలిసి గుడారాల్లో నిద్రించేది.వారితో పాటు కలిసి మెలిసి జీవించేది.
ఇక సైనికులు తాము తింటున్న ఆహారాన్ని దానికి పెట్టేవారు.దాని సైజు పెద్దది కాబట్టి తాము తినేదాని కంటే కొంచెం ఎక్కువ ఆహారం ఇచ్చే వారు.
అయినప్పటికీ ఏ ఒక్క సైనికుడు దాని ఆహారం విషయంలో అభ్యంతరం పెట్టలేదు.

తమ తోటి సైనికుడిగా దానిని భావించే వారు.దీంతో సైనికులతో ఆ వోజ్టెక్ చాలా స్నేహపూరితంగా ఉండేది.సిగరెట్ కాల్చడంతో పాటు బీర్ కూడా తాగేది.సైనికులతో కలిసి ఆడుకునేది.కుస్తీ యుద్ధాల్లో అది ఓడిపోతే చాలా చిన్నబుచ్చుకునేది.తన ఓటమిని అంగీకరిస్తూ ముఖం ముభావంగా పెట్టుకునేది.రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత స్కాట్లాండ్‌లోని ఓ జూకి దానిని పంపించారు.
తోటి ఎలుగుబంట్లతో అది సన్నిహితంగా ఉండలేకపోయింది.మనుషులతో ఎంతో అలవాటు పడిన అది జూకి పంపించగానే ముభావంగా ఉండేది.1963లో దానికి 21 సంవత్సరాల వయసులో వోజ్టెక్ చనిపోయింది.దాని జ్ఞాపకార్థం లండన్‌లోని సికోర్స్‌కీ మ్యూజియం( Sikorski Museum )లో వోజ్టెక్ విగ్రహాన్ని ఉంచారు.2011లో దీనిపై ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.ఇలా ఇది ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న రియల్ హీరోగా మారింది.