బ్యాగ్రౌండ్ లేకపోవడం ఒక అదృష్టం.. నాని అలా ఎందుకు అన్నాడో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఈయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం ఉంది.

 Without Background Is Good Do You Know Why Nani Said That,  Tolllywood, Hero, Na-TeluguStop.com

నాని హీరోగా అడుగు పెట్టకముందు క్లాప్ అసిస్టెంట్ గా పని చేశాడు.నిజానికి ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవ్వాలని అనుకున్నాడు.

కానీ నటుడిగా అడుగు పెట్టాల్సి వచ్చింది.ఇదిలా ఉంటే బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం ఒక అదృష్టం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు నాని.

ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి అష్టా చమ్మా సినిమాతో పరిచయమయ్యాడు.ఈ సినిమాలో హీరోగా నటించిన నాని తన తొలి నటనకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాడు నాని.

ఇక తను ఎంచుకునే కథల విషయం లో కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.ఇక గతంలో మంచి మంచి హిట్ లను అందుకున్న సినిమాలలో అవకాశాలు వచ్చినా కూడా వదిలేసాడు.

ఇక ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టగా అందులో నాని కూడా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అడుగు పెట్టాడు.ఇక బ్యాక్ గ్రౌండ్ ఉంటే మాత్రం ఎప్పటికైనా ఆ నటుడు బ్యాక్ గ్రౌండ్ గుర్తింపుతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అనే పేరు మాత్రమే వినిపిస్తుంది.

Telugu Astachamma, Background, Nani, Nani Background, Natural Nani, Shyam Singa

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో అడుగు పెడితే మాత్రం నటులకు గుర్తింపు వేరేలా ఉంటుంది.నిజానికి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హోదా ను అందుకున్న నటులకు మంచి పేరు ఉంటుంది.

నాని కూడా బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే ఒక అదృష్టం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.తనను ఎవరైనా బ్యాక్ గ్రౌండ్ గురించి అడిగితే మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమే ఒక అదృష్టంగా భావిస్తాను అని తెలిపాడు నాని.

ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి తనను మీ ఫ్యాన్ ని అని చెబితే అతడు కచ్చితంగా తనకు మాత్రమే ఫ్యాన్ అయే ఉంటాడు అని ఆ మాటే తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని తెలిపాడు.

Telugu Astachamma, Background, Nani, Nani Background, Natural Nani, Shyam Singa

కేవలం బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి నందుకు మాత్రమే సొంత గుర్తింపు అందుతుందని.బ్యాక్ గ్రౌండ్ ఉండి అడుగు పెడితే మాత్రం ఎంత సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న కూడా అది బ్యాక్ గ్రౌండ్ కే వర్తిస్తుంది అని తెలిపాడు నాని.ఇక నాని ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉండగా ఇటీవలే తాను నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటించాడు.ఇక ఈ సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇక వీటితో పాటు పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube