ఏటీఎంల నుంచి ఫోన్ పే, గూగుల్ పేతో డబ్బులు తీసుకోండిలా

ప్రస్తుతం చాలా మంది చేతిలో నగదు లేకుండానే లావాదేవీలు చేసేస్తున్నారు.అందరూ డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడుతున్నారు.

 Withdraw Money From Atms With Phone Pay And Google Pay , Atnm, Phone Pay, Paytm,-TeluguStop.com

అందువల్ల పర్సు మర్చిపోయినా, డెబిట్ కార్డు లేకపోయినా ఎంచక్కా షాపింగ్ చేసేస్తున్నారు.చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ తరుణంలో ఒక్కోసారి క్యాష్ అవసరం పడుతుంది.అలాంటి సందర్భాల్లో పర్సు మర్చిపోయినా, ఏటీఎం కార్డు లేకపోయినా ఇబ్బంది ఎదురవుతుంది.

అన్ని చోట్ల డిజిటల్ చెల్లింపులే జరుగుతున్న ప్రస్తుత తరుణంలోనూ కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్లు చేయాల్సి ఉంటుంది.అలాంటి సందర్భాలలో కస్టమర్ల కోసం బ్యాంకులు వినూత్న నిర్ణయం తీసుకున్నాయి.

డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం సెంటర్లలో డబ్బు డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

అందరికీ యూపీఐ ఆధారిత పేమెంట్లు చేసే యాప్‌లపై అలవాటు పడి ఉంటారు.ఫోన్ పే, గూగుల్ పే, పే టీఎం వంటి యాప్‌లను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు.

అయితే ఒక్కోసారి చేతిలో లిక్విడ్ క్యాష్ కోసం ఇబ్బంది ఎదురవుతుంటుంది.అయితే ఏటీఎంలలో క్యూఆర్ కోడ్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్‌లను ఉపయోగించి క్యాష్ విత్ డ్రా చేయొచ్చు.

ఏదైనా ఏటీఎం మెషీన్‌ని సందర్శించి, నగదు విత్‌డ్రా ఎంపికను ఎంచుకోండి.ఏటీఎం మెషిన్ స్క్రీన్‌పై యూపీఐ ఎంపికను ఎంచుకోండి.

తర్వాత, ATM స్క్రీన్‌పై QR కోడ్ ప్రదర్శించబడుతుంది.ఇప్పుడు, మీ ఫోన్‌లో ఏదైనా UPI ఆధారిత చెల్లింపు యాప్‌ని ఎంచుకుని, QR కోడ్ స్కానర్‌కి మారండి.కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత, వినియోగదారు ప్రస్తుత పరిమితి రూ.5,000లోపు అవసరమైన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.‘హిట్ ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి UPI పిన్‌ని నమోదు చేయండి.ఇలా ఈ దశలను ఉపయోగించి, మీరు రూ.5 వేల వరకు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube