మొబైల్ యాప్ లతో ఏటీఎం లో నుండి డబ్బులు విత్ డ్రా.. ఎలాగో తెలుసా..?

మీరు ఎవరైనా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే మీ వద్ద డెబిట్ కార్డు లేదా !? ఐతే మీకు ఒక శుభవార్త కేవలం ఫోన్ ద్వారానే మీరు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.అది ఎలా అంటే.

 Withdraw Money From Atms With Mobile Apps Do You Know How  Atm Money With Draw,-TeluguStop.com

మీ ఫోన్ లో కేవలం పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ పేమెంట్ మొబైల్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది.వాటి ఆధారంగా మీరు సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఈ విషయాన్ని స్వయంగా ఏటీఎం తయారు చేసే సంస్థ ఎన్‌‌సీఆర్ కార్పొరేషన్ వారు తెలియజేశారు.కేవలం యూపీఐ ఆధారిత యాప్‌ లతో డబ్బులను విత్ డ్రా చేసుకునే విధంగా సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టపోతున్నట్లు ఎన్‌‌సీఆర్  కార్పొరేషన్ సంస్థ తెలియజేసింది.

ఇప్పటికే 1500 పైగా ఏటీఎంలలో ఈ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు, అలాగే అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా మరిన్ని ఏటీఎంలలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడానికి తగిన ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.అయితే కేవలం యూపీఐ ద్వారా అదే ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేయాలో తెలుసుకుందామా మరి.

Telugu Atm, Google Pay, Neww, Paytm, Phone Pay, Upi Apps-Latest News - Telugu

ఇందుకు ముందుగా మీ మొబైల్ ఫోన్ లో వుండే యూపీఐ ఆధారిత మొబైల్ పేమెంట్ యాప్‌ ను ఓపెన్  చేయాల్సి ఉంటుంది.ఐతే ఆ యాప్ లో మీ బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి.అనంతరం ఏటీఎంలో క్యూఆర్ క్యాష్ ఆప్షన్‌ ను ఎంచుకుని ఏటీఎం తెరపై కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.ఇలా స్కాన్ చేసిన అనంతరం డిజిటల్ యూపీఐ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత ఏటీఎం మిషన్ నుంచి సులువుగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.ప్రస్తుతానికి ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా కేవలం 5000 రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తుంది.

భవిష్యత్తులో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube