ఆ వ్యాఖ్య‌ల‌తో సొంత పార్టీ నుంచే చంద్ర‌బాబుకు సెగ‌..?

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారిపోతోంది.చంద్ర‌బాబు నాయుడు ఏదో చేయాల‌నుకుంటో చివ‌ర‌కు అది ఇంకేదో అవుతోంది.

 With Those Comments Did Chandrababu Join His Own Party-TeluguStop.com

అది త‌మ పార్టీనే ఇబ్బందుల్లో ప‌డేస్తోంది.ఇక తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన చంద్ర‌బాబు మ‌రోసారి తొంద‌ర‌ప‌డ్డారు.

దీంతో ఆయ‌న‌కు ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచే సెగ తగులుతోంది.పరిషత్ ఎన్నికలకు ముందు చంద్ర‌బాబు చాలా బాగా మాట్లాడారు.

 With Those Comments Did Chandrababu Join His Own Party-ఆ వ్యాఖ్య‌ల‌తో సొంత పార్టీ నుంచే చంద్ర‌బాబుకు సెగ‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌న‌మే గెలుస్తాం, ఇబ్బంది లేదు అన్న రేంజ్‌లో ఉత్సాహం నింపారు.కానీ ఎన్నికల ఫలితాల్లో 700 ఎంపీటీసీల‌ను టీడీపీ గెలుచుకుంది.

ఇక అక్క‌డ‌క్క‌డా కొన్ని జడ్పీటీసీ స్థానాలను కూడా టీడీపీ త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో కొంత ప‌ర్వాలేద‌నిపించింది.అయితే ఎన్నిక‌ల ఫ‌లితాల స‌మ‌యంలో చంద్ర‌బాబు మేం ఎన్నికలు బహిష్కరించాం అని చెప్పుకొచ్చారు.

దీంతో ఈ మాట‌లు విన్న వారంతా కూడా మ‌రి మ‌న పార్టీ నుంచి గెలిచిన వారంతా రెబల్స్ అనుకోవాలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.మ‌రి ఇలా పోటీ చేసి గెలిచిన వారిని పార్టీ వీరిని సస్పెండ్ చేస్తారా అంటే అడుగుతున్నారంట‌.

ఈ ప్రశ్నలు కూడా బాబుకు చాలా ద‌గ్గ‌రి స‌న్నిహితులు అడుగుతున్నార‌ని తెలుస్తోంది.

Telugu Ap News, Ap Politics, Ap Tdp, Chandrababu, Cm Jagan, Parishath Elections, Tdp, Ycp, Zptc Mptc-Telugu Political News

ఇక సోష‌ల్ మీడియాలో కూడా పోస్టవుతున్నాయి ఈ ప్రశ్నలు.ఇంకో విష‌యం ఏంటంటే చంద్ర‌బాబు పార్టీ త‌ర‌ఫున ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బీఫారాలు ఇచ్చిన తర్వాత అభ్య‌ర్థులు అంద‌రూ కూడా నామినేషన్లు వేశారు.ఇక ఆ త‌ర్వాత ఈసీ ఎంట‌ర్ అవ‌డంతో తాము ఎన్నిక‌ల‌ను బహిష్కరిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.

కానీ అప్పుడు కూడా త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఉపసంహరించుకోవాలని చెప్ప‌క‌పోవ‌డం మైన‌స్ గా మారింది.అప్పుడే ఆ ప్ర‌క‌ట‌న చేసి ఉంటే ఇప్పుడు ఒక్క సీటు రాక‌పోయినా అడిగే వారు ఉండ‌క‌పోయేవారు.

ఏదేమైనా చంద్ర‌బాబు చేసిన చివ‌ర‌కు సొంత పార్టీ నుంచే విమ‌ర్శ‌లు తెప్పిస్తోంది.

.

#Chandrababu #AP #Zptc Mptc #Parishath #AP TDP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు