ఐదు రకాల ఆహారంతో.. హైబీపీకి చెక్‌ పెట్టండి!

ఈ రోజుల్లో హైపర్‌టెన్షన్‌ లేదా బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది.దీనివల్ల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది.

 With These Food Can Control The High Blood Pressure-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది హైబీపీ రోగులు ఉన్నారు.కొన్ని సమయాల్లో ఆర్ధరైటీస్‌ లెవల్‌ పెరిగి ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.

తద్వారా గుండెను ప్రమాదంలో పడవేయడంతోపాటు గుండె సంబంధిత రోగాలకు దారి తీస్తుంది.అంటే హార్ట్‌ అటాక్‌ వంటి స్ట్రోకులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

 With These Food Can Control The High Blood Pressure-ఐదు రకాల ఆహారంతో.. హైబీపీకి చెక్‌ పెట్టండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే బీపీతో బాధపడేవారు చికిత్స చేయించుకోకుండా ఉండరాదు.లేకపోతే ఇది ప్రాణంతకమయ్యే ప్రమాదం ఉంటుంది.

దీన్ని మనం తినే కొన్ని పదార్థాల ద్వారా కూడా కంట్రోల్‌ చేయవచ్చు.అవేంటో తెలుసుకుందాం.

సోడియం ఆధారిత ఫుడ్‌ను తగ్గించాలి.

హైబీపీ సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్లేనని కొన్ని నివేదికలు తెలిపాయి.ఇది హార్ట్‌ స్ట్రోక్‌కు కూడా దారితీస్తుంది.ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో సోడియం స్థాయి తక్కువగా ఉన్న ఫుడ్‌ తీసుకుంటే.

బీపీ స్థాయి కూడా 5–6 ఎంఎం హెచ్‌జీ తగ్గుముఖం పడుతుంది.అంతేకాదు హైబీపీ లేని వ్యక్తులు కూడా సోడియాన్ని తగ్గించి తీసుకోవాలి.

మాములు వ్యక్తులు ప్రతిరోజు 2,300 మి.గ్రా మించిన ఉప్పును వాడకూడదు.

పొటాషియం ఎక్కువగా తీసుకోవాలి

హైబీపీతో బాధపడేవారికి పొటాషియం మంచి న్యూట్రియెంట్స్‌ను అందిస్తుంది.ఇది శరీరంలో ఉన్న సోడియం స్థాయిని తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో కూడా ఎక్కువ శాతం సోడియం ఫుడ్‌ ఉంటుంది.ఆకుకూరలు, బంగాళదుంప, టమాట, స్వీట్‌ పొటాటో, వాటర్‌ మిలాన్, మాస్క్‌ మిలాన్, అరటిపళ్లు, అవకాడో, ఆరెంజ్, ఆప్రికాట్స్, నట్స్, సీడ్స్, మిల్క్, పెరుగు, ట్యూనా సాల్మన్లలో కూడా పుష్కలంగా ఉంటుంది.

ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరి.

ప్రతిరోజు దాదాపు 30–45 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ ఎక్సర్‌సైజ్‌లు చేయాలని నివేదికలు ఇప్పటికే తెలిపాయి.దీనివల్ల క్రానిక్‌ డిసీజెస్‌ నుంచి బయటపడవచ్చు.ప్రతిరోజూ 40 నిమిషాల నడక కూడా మంచిది.

మద్యపానం దూమపానానికి దూరంగా

సిగరేట్స్, ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా హై బీపీ వస్తుంది.ఆల్కహాల్‌ ద్వారా 16 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు.

ఆల్కహాల్‌ నికొటిన్‌ బీపీ ని పెంచి రక్తనాళాలను పాడుచేస్తాయి.ఈ రెండు ఆరోగ్యానికి మంచివి కావు.

వీటిని మానివేయడమే మేలు

#Good Health #Banana And Milk #For Good Health #ControlHigh #Sodium

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు