తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో లెక్కలన్నీ మారిపోయాయి.వైసిపి సిట్టింగ్ స్థానం ను దక్కించుకోవాలని టీడీపీ, బీజేపీ – జనసేన కూటమి ఎంతగా ప్రయత్నించినా , జగన్ రాజకీయ ఎత్తుగడల ముందు అవేమీ పనిచేయలేదు.
వైసిపికి రాష్ట్రవ్యాప్తంగా జగన్ బలమైన పునాది వేయడం, పరిపాలనలో ప్రజాపక్షం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇలా అనేక కారణాలతో వైసిపికి తిరుగులేని ఆధిక్యం దక్కింది.ఎలా అయినా తిరుపతిలో గెలవాలి అని చూసిన టిడిపి, బీజేపీ అభ్యర్థులకు పరాభవమే ఎదురైంది .బిజెపి అభ్యర్థి రత్నప్రభ తరపున బిజెపి కేంద్ర పెద్దలు అంతా రంగంలోకి దిగారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగి రత్నప్రభ విజయం కోసం కృషి చేశారు.
ఇక్కడ బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు.
కానీ చివరకు గెలుస్తుందన్న బిజెపి అభ్యర్థి రత్నప్రభ ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు.
ఇక మూడో స్థానానికి పడిపోతుందని భావించిన టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానానికి రాగలిగారు.ప్రాంతీయ పార్టీల హవా ముందు జాతీయ పార్టీ ల పెత్తనం చెల్లదని విషయం అర్థం అయిపోయింది.
జనసేన బిజెపి ఉమ్మడిగా పోటీ చేసినా ఆరు శాతం ఓట్లు తెచ్చుకోలేని పరిస్థితిలో బిజెపి ఉండడంతో ఇక రాబోయే రోజుల్లో రాజకీయం మరింత దుర్భరంగా ఉంటుందని, ఆ రెండు పార్టీల నేతలకు ఒక అంచనా వచ్చేసింది.వైసీపీకి ఇక్కడ 56 శాతం ఓటింగ్ రాగా, టిడిపికి 32 శాతం, బిజెపి, జనసేన కూటమికి ఐదు శాతం పైగా ఓట్లు వచ్చాయి.
అంటే టిడిపి జనసేన బీజేపీ కూటమి ఏర్పడినా, 37 శాతానికి మించి ఉండేది కాదు.అలా చూసుకున్న వైసీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదనే విషయం అర్థమైంది.అయితే రాబోయే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ఇదే పరిస్థితి ఎదురవుతుందనే లెక్కలు బయటకి వస్తున్నాయి.కాకపోతే అప్పటికి జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుందని, అయినా వైసీపీ విజయానికి ఏ దొఖా లేదు అనే విషయం అర్ధం అవుతోంది.