ఈటల రాజీనామాతో ఆ ప‌ద‌వి కేటీఆర్ చేతికి..?

ఈట‌ల రాజేంద‌ర్ అంటే తెలంగాణ‌లో కేసీఆర్ త‌ర్వాత ఉద్య‌మ లీడ‌ర్‌గా పేరుంది.ఉద్య‌మ కాలం నుంచే తెలంగాణ‌లో ఉన్న అనేక సంఘాలు, సంస్థ‌ల‌తో ఈట‌ల‌కు ప‌రిచ‌యాలు ఉన్నాయి.

 With The Resignation Of Eeta The Post Fell Into The Hands Of Ktr , Ktr, Etala, P-TeluguStop.com

ఈ ప‌రిచ‌యాల‌తోనే తెలంగాణ ఏర్ప‌డ్డాక ఆయా సంస్థ‌ల‌కు, సంఘాల‌కు గౌర‌వ అధ్య‌క్షుడిగా ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎన్నుకున్నారు ఆయా సంఘాల స‌భ్యులు.అప్పటి నుంచి ఇప్ప‌టి దాకా ఆ సంఘాల‌కు ఈట‌లనే అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు.

అయితే ఇప్పుడు ఆయ‌న టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, తాను అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న అన్ని ప‌ద‌వుల‌కు ఆయ‌న రాజీనామాలు చేశారు.దీంతో చాలా కీల‌క ప‌ద‌వులు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి.

అలాంటి వాటిల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడి ప‌ద‌వి కూడా కీల‌కంగా ఉంది.దీనికి ఉమ్మ‌డి రాష్ట్రం ఉన్న‌ప్ప‌టి నుంచే పోటీ విప‌రీతంగా ఉండేది.

ఇది చాలా ప‌వ‌ర్‌ఫుల్ ప‌ద‌వి అని కూడా పేరుంది.

అయితే దీనికి రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు.

చూసేందుకు చిన్న ప‌ద‌విలాగే అనిపించినా బాగా నిధులుంటే ప‌ద‌వి ఇది.పవర్ కూడా బాగానే ఉంటుంది ఈ పదవికి.

Telugu @ktrtrs, Etela Bjp, Etela, Nampally, Powerful, Telangana-Telugu Political

ఈ పదవికి ఎంపిక కావాలంటే అంత ఈజీ కాద‌ని చెబుతుంటారు సంఘం స‌భ్యులు.అలాంటి కీల‌క ప‌ద‌వికి ఇప్పుడు ఈటల రాజీనామా చేయడంతో కేటీఆర్‌కు మార్గం సుగుమం అయింది.ఈ ప‌ద‌వికి పోటీ బాగానే ఉండ‌టంతో వివాదం అవుతుంద‌ని కేటీఆర్‌ను చేస్తే ఎలాంటి వివాదాలు త‌లెత్త‌వ‌ని భావిస్తున్నారు.కేటీఆర్ కూడా దీనికి సుముఖంగానే ఉన్నారంట‌.త్వ‌ర‌లోనే ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని తెలుస్తోంది.ఇదొక్క‌టే కాదు చాలా ప‌ద‌వుల‌కు ఈట‌ల రాజీనామా చేయ‌డంతో వాటికి కూడా కేటీఆర్ చేప‌డ‌తార‌ని తెలుస్తోంది.

ఏదేమైనా ఈట‌ల రాజీనామా కేటీఆర్‌కు బాగానే క‌లిసి వ‌స్తుంద‌ని చెప్పాలి.చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప‌ద‌వులు చేప‌డ‌తారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube