ఆ విధంగా క్రెడిట్ కొట్టేసిన జగన్ ? ఇరకాటంలో బాబు ?

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆషామాషీగా తీసుకోరు.దాని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఎన్నెన్నో ఉంటాయి.

 With The Formation Of New Districts The Growing Popularity Of Jagan Further Incr-TeluguStop.com

తమ పార్టీకి ప్రభుత్వానికి మేలు జరిగే విధంగా జగన్ లెక్క చూసుకుని మరీ తన నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తొందరపడి నిర్ణయాలు తీసుకున్నారు అని అనిపించినా.

చివరికి దాని ఫలితం పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేదిగానే ఉంటుంది.తాజాగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం, ప్రాంతాలకు అనుగుణంగా జిల్లాల పేర్లు పెట్టడం వెనక జగన్ స్ట్రాటజీ ఏంటి అనేది ఇట్టే అర్థమైపోతుంది.

  ముఖ్యంగా ప్రస్తుత కృష్ణాజిల్లాలో కొంత భాగానికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టడం చూస్తే జగన్ వ్యూహం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాను అని జగన్ పాదయాత్ర సమయంలోనే ప్రకటించారు.

అన్నట్టుగానే ఇప్పుడు అమలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఆ వర్గంలోని కీలక వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయడం సామాజికంగా , ఆర్థికంగా దెబ్బతీయడం, ఆ వర్గం ను పూర్తిగా దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా వ్యవహారాలు నడిచాయి.

దీనిపై తెలుగుదేశంతో పాటు , జనసేన వంటి వారి పార్టీలు ఆందోళన చేయడంతో పాటు జగన్ కమ్మ సామాజిక వర్గం ను పూర్తిగా దెబ్బతీసేందుకు కంకణం కట్టుకున్నారనే ప్రచారాన్ని ఉధృతం చేశాయి.అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం తో ఒక్కసారిగా ఆ లెక్కల మారిపోయాయి.

కమ్మ సామాజిక వర్గం లో జగన్ పై సానుకూలత పెరిగింది.కరుడుగట్టిన టీడీపీ వాది, ఎన్టీఆర్ హాయం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు ఇప్పుడు బహిరంగంగా జగన్ ను ప్రశంసిస్తున్నారు.అలాగే ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి సైతం ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు.అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీనిపై కామెంట్ చేశారు.ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామన్నారు.ఇక ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన తెరపైకి వస్తోంది.

ఎన్టీఆర్ విషయంలో బాబు చాలా నిర్లక్ష్యం చేశారని ఆయన వర్ధంతి , జయంతి కి పూల దండలు వేయడం తప్పించి ఎన్టీఆర్ కోసం చేసిన ఏమీ లేదని, ఆయనకు భారతరత్న ఇప్పించే విషయం లోనూ గట్టి ప్రయత్నాలు చేయలేదనే ప్రచారం తెరపైకి వచ్చింది.

TDP leaders Praising CM Jagan For Naming Vijayawada District After NTR

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube