తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతూ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలన్నీ కెసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇటు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ కూడా రాజకీయంగా పెనుసంచలనాలను సృష్టిస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకుండా చేయడం దగ్గర నుండి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఉగాది వేడుకలకు సైతం ప్రభుత్వం దూరంగా ఉండటంతో ఇక ఇటు గవర్నర్ కు , ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గే అవకాశం లేనట్టు మనకు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి మనకు అర్ధమవుతోంది.
అయితే గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయనే వాదన కూడా రాజకీయ విశ్లేషకులలో లేకపోలేదు.
నన్ను ఎవరూ లొంగదీసుకోలేరని, నేను చాలా స్ట్రాంగ్ నని, నేను చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తానని నన్ను ఎవరూ అడ్డుకోలేరని గవర్నర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.అంతేకాక త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరింత మంటను రాజేసిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ఇక గవర్నర్ మరింతగా రాజకీయ పరిస్థితులపై జోక్యం చేసుకుంటుండటంతో ఇక తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమనే వార్తలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే గవర్నర్ వ్యాఖ్యలపై ఇంకా కెసీఆర్ కానీ ఇతర టీఆర్ఎస్ నేతలు స్పందించకున్నా రానున్న రోజుల్లో తప్పకుండా స్పందించే అవకాశం ఉంది.అయితే బీజేపీ గవర్నర్ లు ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇదే తరహా వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో రానున్న రోజుల్లో గవర్నర్ ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.







