మహోగని చెట్ల పెంపకంతో.. కాస్త శ్రమతో ఆదాయం కోట్లలో..!

మహోగని చెట్ల పెంపకం( Plantation of mahogany trees ) ఒక ఎకరా భూమిలో 12 సంవత్సరాలు సాగు చేస్తే ఆదాయం కోట్లల్లో అర్ధించవచ్చు.కానీ మిగతా చెట్ల పెంపకం కంటే ఈ మహోగని చెట్ల పంపకం కాస్త కష్టమనే చెప్పాలి.

 With The Cultivation Of Mahogany Trees With A Little Effort, The Income Is In Cr-TeluguStop.com

చాలా సహనంతో వీటి పెంపకం చేయాల్సి ఉంటుంది.ఈ మహోగని చెట్ల పెంపకం గురించి అవగాహన పొందిన చాలామంది ఇతర వ్యాపారాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సైతం పక్కన పెట్టేసి ఈ చెట్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు.

మహోగని చెట్లు గోధుమ రంగు కలప ను కలిగి ఉంటాయి.ఇంకా ఈ చెట్ల యొక్క ( Leaves, seeds, wood ) మార్కెట్లో ఏడాది పొడవునా అధిక ధర పలుకుతుంది.

ఈ మహోగని అడుగులు అంత త్వరగా చెడిపోవు.కాబట్టి ఈ చెట్టు నుండి సేకరించిన చెక్కతో ఓడలు, ఫ్లైవుడ్, ( Ships, Flywood )ఆభరణాలు లాంటి అత్యంత విలువైన వస్తువులు తయారు చేస్తారు.

అంతేకాదు ఈ మహోగని చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ముఖ్యంగా ఈ మహోగని చెట్ల వద్దకు దోమలు రావు.కాబట్టి ఈ మొక్క యొక్క ఆకులను, విత్తనాలను దోమల నివారణ కోసం తయారు చేసే క్రిమిసంహారకాలలో ఉపయోగిస్తారు.ఇంకా రంగులు, సబ్బులు, వార్నిష్ లాంటి వాటిలో కూడా ఈ చెట్టు యొక్క ఆకులు, గింజలను ఉపయోగిస్తారు.

ఈ మహోగని చెట్లను బలమైన గాలులు వీచే ప్రాంతంలో పెంచకూడదు.ఇక సాధారణ పీహెచ్ విలువ ఉండే సారవంతమైన నేల అవసరం.మహోగని చెట్టు పరిపక్వం చెందడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది.ఇక ఐదు సంవత్సరాలకు ఒకసారి విత్తనాలు ఉత్పత్తి అవుతాయి.ఒక మొక్క నుండి దాదాపు 5 కిలోల విత్తనాలను పొందవచ్చు.మహోగని చెక్క అడుగు రూ.2000 పైనే ఉంటుంది.అంటే ఒక చెట్టు దాదాపు రూ.20 నుండి 30 వేల వరకు ధర పలుకుతుంది.ఒక ఎకరంలో దాదాపు 120 మహోగని చెట్లను నాటుకోవాలి.

ఒక ఎకరం లో చెట్లు నాటడానికి దాదాపు 50 వేల వరకు ఖర్చు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube