జిల్ నిర్ణయంతో..అమెరికన్స్ ఫిదా...సొంత ఖర్చులతో..

అమ్మ మనసు మరో అమ్మకు మాత్రమే తెలుస్తుంది, పిల్లలకు తల్లి తండ్రులకు మధ్య ఉన్న పేగు భంధం కేవలం మనసుతో ఆలోచన చేసే వ్యక్తులకు మాత్రమే అర్ధం అవుతుంది.ఇందులో ఎలాంటి సందేహం లేదు.

 With-jills-decision-americans Pay At Own Expense,america ,white House,jill Biden-TeluguStop.com

పిల్లలకోసం తల్లులు పడే ఆరాటం మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తనదైన శైలిలో దూసుకు పోతుంటే ఆయన సతీమణి ప్రధమ మహిళ అయిన జిల్ బిడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్స్ మనసులను కొల్ల గొడుతున్నారు.

అమెరికన్స్ ఫిదా అయ్యేలా ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలిస్తే చదివిన వాళ్ళు కూడా ఫిదా అవ్వాల్సిందేవివరాలలోకి వెళ్తే.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన నాలుగేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలలో కొన్ని నిర్ణయాలు కర్కశంగా ఉన్నాయి.

ముఖ్యంగా అమెరికా ఫస్ట్ పేరుతో వలస వాసులపై పెట్టిన ఆంక్షలు, కొందరిని నిర్భందించిన తీరు చూస్తే ట్రంప్ మరో నియంతగా కనిపిస్తాడు.సరిహద్దులు దాటి అమెరికాలో అక్రమంగా వచ్చిన వలస వాసుల పిల్లలు సుమారు 5 వేల మందిని తల్లి తండ్రుల నుంచి విడదీశాడు.

చిన్న చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం లేకుండా భార్యా భర్తలు వేరు వేరుగా, వారి పిల్లలను వేరు వేరుగా చేసి రాక్షసానందం పొందాడు.అపట్లో ఈ చర్యల పట్ల మెలానియా ట్రంప్ అసహనం కూడా వ్యక్తం చేసిందిఅయితే.

Telugu America, Jinn Biden, White Hiuse-Telugu NRI

ట్రంప్ చర్యల పట్ల ప్రస్తుత ప్రధమ మహిళ జిల్ బిడెన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.అంతేకాదు ఇప్పుడు ఈ కుటుంభాలు అందరిని కలపడానికి ఆమె సిద్దంగా ఉన్నారట.ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.సరిహద్దుల వద్ద విడిపోయిన కుటుంభాలను కలిపేందుకు జిల్ బిడెన్ ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ఆమె తన సొంత ఖర్చులతో వారిని విముక్తుల్ని చేయనున్నారని తెలిపింది.

త్వరలో అధికారిక ఉత్తర్వులతో తల్లి తండ్రులు వారి పిల్లలను కలుపనున్నారని వైట్ హౌస్ ప్రకటించింది.జిల్ బిడెన్ ఈ విషయంలో తీసుకున్న చొరవకు హ్యాట్సా ఫ్ చెప్తూ, అమెరికాకు మంచిరోజులు వచ్చాయంటూ వలస వాసులు జిల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube